WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతి అధికారికి...పోస్టింగ్‌ ఇప్పించిన మంత్రి....!

ఆయన ఒక కీలకమైనశాఖకు అధికారిగా పనిచేస్తున్నారు...శాఖలో ఉన్నన్నాళ్లు...అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. మూడేళ్ల పాటు...ఆడింది..ఆటగా..పాడింది పాటగా...ఆ అధికారి దోచేశారు. ఆయన అవినీతి వ్యవహారంపై సచివాలయంలో జోరుగా ప్రచారం జరిగినా...ఏలికలు పెద్దగా పట్టించుకోలేదు. ఐఎఎస్‌ అధికారుల బదిలీలు జరిగిన ప్రతిసారీ అతన్ని కూడా బదిలీ చేస్తారని ప్రచారం జరగడం...చివరకు అదేమీ లేకుండా పోవడం రివాజుగా మారింది. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న ఈ శాఖలో పెరిగిపోయిన అవినీతి గురించి పత్రికలు,ఛానెల్స్‌ ఘోషించినా..సంబంధిత మంత్రి కానీ...సిఎంఒ కార్యాలయం కానీ పట్టించుకోలేదు.  చివరకు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో...ఆయనను అక్కడి నుంచి తప్పించి పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టారు. 

  దీంతో  మనోడు ఎక్కడ తిప్పాలో...అక్కడ చక్రం తిప్పాడు...! కుల కార్డు బయటకు తీశాడు...తన వర్గానికి చెందిన మంత్రిని కలసి...తనకు పోస్టింగ్‌ ఇప్పించమని ప్రాధేయపడ్డారు...మంత్రికి కావాల్సిన అన్నీ అమర్చారు. ఇంకేముంది..నోరున్న ఈ మంత్రి రంగంలోకి వచ్చారు. ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై చీటికి మాటికి..నిప్పులు గక్కే...ఈ నేత...అవినీతి పరుడైన అధికారి కోసం సిఎంఒ చుట్టూ ప్రదిక్షణలు చేశారు. సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి 'సతీష్‌చంద్ర'ను కలసి...తమ వర్గానికి చెందిన అధికారికి పోస్టింగ్‌ ఇవ్వకపోతే ఎలా...? ఆయన నెల రోజుల నుంచి పోస్ట్‌ లేక బాధపడుతున్నారు...తక్షణమే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారట. దీంతో 'సతీష్‌'...ఇది తన నిర్ణయం కాదని...సిఎం నిర్ణయమని...సిఎంను కలవాలని చెప్పినా...వినలేదట. చివరకు... సదరు అవినీతిపరుడైన అధికారికి మరో శాఖలో పోస్టింగ్‌ ఇస్తూ...ఆర్డర్స్‌ జారీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశం అవుతోంది. అవినీతికి దూరంగా ఉండాలని... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత చెప్పినా...మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నాయకులు... అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని..వీరిని ఎవరూ బాగుచేయలేరని...గొణుక్కుంటున్నారు.


(337)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ