WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణ రైతులు బీరులు తాగుతున్నారట...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్తగా రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం 'రైతుబంధు'. ఈ పథకంపై రాజకీయ వర్గాల్లో రకరకాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ తమది రైతు ప్రభుత్వమని..దానికి ఈ పథకమే నిదర్శనమని, రైతులకు పెట్టుబడి కోసం ముందుగానే సొమ్ములు ఇస్తున్నామని..దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఈ విధంగా చేసిన దాఖలాలు లేవని...గొప్పలు చెప్పుకొంటోంది.దేశవ్యాప్తంగా వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం పథకాన్ని ప్రశంసిస్తూనే..దానిలోని లోపాలను ఎత్తి చూపుతోంది. పథకం వల్ల...రైతులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని...ఆరోపిస్తోంది. ఎకరాకు ఎనిమిది వేలు ముందస్తుగా చెల్లిస్తున్నానని చెప్పడం బాగానే ఉంది..కానీ...కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. తెలంగాణలో ఉన్న రైతుల్లో దాదాపు 50శాతం మంది కౌలు రైతులేనని..వారందరికీ ఈ పథకం వల్ల ఉపయోగంలేదని వాదిస్తోంది. వ్యవసాయం చేయని..సంపన్న వర్గాలకు మాత్రమే దీని వల్ల లాభం చేకూరుతుందని...వాస్తవంగా వ్యవసాయం చేసే వారికి లాభం లేదని విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌ విమర్శల్లో వాస్తవం ఉన్నా...కెసిఆర్‌ చేస్తోన్న ప్రచారం ముందు అది నిలబడడం లేదు. వ్యవసాయం చేయని వారికి చెక్‌లు ఇస్తూ...వ్యవసాయం చేస్తోన్న వారికి ఒట్టి చేతులు చూపుతున్నారనే మాట..ఇప్పుడిప్పుడే..తెలంగాణ వ్యాప్తంగా బలపడుతోంది. 

 కాగా...కాంగ్రెస్‌,టిఆర్‌ఎస్‌లు ఇలా విమర్శించుకుంటుంటే...బిజెపి మాత్రం మరో రకంగా స్పందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మొదట విడతగా..ఇచ్చిన నాలుగు వేల రూపాయలతో రైతులు బీరులు తాగుతున్నారని ఆ పార్టీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి కృష్ణసాగర్‌రావు మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం ఇస్తోన్న సొమ్ములతో రైతులు బీరులు తాగుతున్నారని... వ్యవసాయానికి ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణలపై రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. రైతులను బిజెపి నేతలు అవమానపరుస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద..వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటే...బిజెపి నేతలు..వారినేత..చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా సమర్థించుకుంటారో వేచి చూడాల్సిందే.


(137)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ