కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ....! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ....!

పైచేయి కోసం హోరాహోరి పోరాడుతున్న కాంగ్రెస్‌,బిజెపి

దేశ వ్యాప్తంగా ఉత్కంఠత రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బిజెపి హోరాహోరిగా పోరాడుతున్నాయి. మంగళవారం నాడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లలో అధికార కాంగ్రెస్‌,ప్రతిపక్ష బిజెపిలు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్‌79, బిజెపి79, జెడిఎస్‌ 25 సీట్లలో ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్దిరామయ్య పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా సంస్థలు అంచనా వేసినట్లు...కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌, బిజెపి పైచేయి కోసం ప్రయత్నాలు చేస్తుంటే...చాప కింద నీరులా జెడిఎస్‌ కొన్ని సీట్లను కొల్లగొడుతోంది. దీంతో...హంగ్‌ అసెంబ్లీ తప్పేటట్లు లేదు. మొదటి ఫలితాలు..అటు కాంగ్రెస్‌కు, ఇటు బిజెపికి కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పూర్తి ఫలితాలు 12గంటలకు కానీ...రావు.

(137)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ