WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గెలుపుబాటలో బిజెపి...!

ఉత్కంఠత వీడింది. కర్ణాటకలో ప్రతిపక్ష బిజెపికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఆ పార్టీ113 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్‌ తొలి రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం చూపినా...క్రమేనా...ఆధిపత్యం కోల్పోయి 62 స్థానాల్లో ఆధిక్యం చూపుతోంది. మరో పార్టీ అయిన జెడిఎస్‌ 42స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రేసులో వెనుకబడుతుండడంతో బిజెపి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఆ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 113స్థానాలను టచ్‌ చేసింది. ఇప్పుడు ఈ స్థానాల్లో ఆధిక్యతను నిలబెట్టుకోగలిగితే...ఆ పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్ప మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద...బిజెపికి గట్టిపోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్‌ చివరకు చతికలపడింది. అదే సమయంలో జెడిఎస్‌ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన 40సీట్లను మళ్లీ ఆ పార్టీ సాధిస్తోంది. అంతకన్నా ఒకటి రెండు సీట్లు అధికంగా సాధించే పరిస్థితి ఉంది.

(212)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ