WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లగడపాటి' లీకులే నిజమయ్యాయి....!

మాజీ రాజకీయవేత్త, ఎన్నికల ఫలితాల సర్వే స్పెషలిస్టు 'లగడపాటి రాజగోపాల్‌' కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సర్వే చేశారని...ఆయన సర్వేలో బిజెపి ఒంటరిగానే గెలుస్తుందని...ఒక పత్రిక కథనం ప్రచురించింది. ఆయన పేరు ప్రస్తావించకుండా...అన్యాపదేశంగా... పేర్కొంటూ...కర్ణాటకలో బిజెపి గెలుస్తుందని...వార్త రాసింది. అయితే...ఈ వార్తపై విమర్శలు వచ్చాయి. కావాలనే ఆ పత్రిక...ఆ విధంగా...కథనాలు ఇస్తోందని...దానికి లేని పోనివి అంటగట్టారు. కానీ..ఈ రోజు వచ్చిన ఫలితాలు చూస్తే...'లగడపాటి' లీకులే నిజమయ్యాయి. ఆయనతో గతంలో పనిచేసిన సర్వే సంస్థ 'చాణిక్య' కూడా ఇదే ఫలితాలు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పింది. అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు. పైగా...'లగడపాటి' సర్వే చేయలేదని...కొందరు వాదించారు. ఆయన సర్వే చేస్తే...బహిరంగంగా ప్రకటిస్తారని...ఆయన ప్రకటించలేదంటే...ఆయన సర్వే చేయించలేదని...వారు అన్నారు. అయితే... 'లగడపాటి'..ఈ సర్వే ఫలితాలను బయటపెట్టడానికి ఇష్టపడలేదని...తాను ఫలితాలను ప్రకటిస్తే...బిజెపికి అనుకూలంగా మారుతుందనే అంచనాతోనే ఆయన సర్వేవివరాలను విడుదల చేయలేదని చెబుతున్నారు. మొత్తం మీద..ఆయన పరోక్షంగా ప్రకటించిన ఫలితాలే ఇప్పుడు..కర్ణాటకలో నిజం అవుతున్నాయి. బిజెపి గెలుస్తుందన్న ఆయన పరోక్ష మాటలు అక్షరాలా నిజం అయ్యాయి.


(458)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ