WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' టార్గెట్‌ 2019 కాదట...2024 అట....!

ఇటీవల రాయలసీమకు చెందిన సీనియర్‌ రాజకీయనాయకుడు వై.ఎస్‌.కు అత్యంత సన్నిహితుడైన ఆయన ఏదో పనిమీద విజయవాడకు వచ్చి..ఆ దరిదాపులే...వై.ఎస్‌.జగన్‌.పాదయాత్ర చేస్తున్నా రని...ఆయనను పలకరించేందుకు వెళ్లారు. అక్కడ 'జగన్‌'ను కలిశారు. కలిసి మాట్లాడిన..తరువాత...బిజెపిపై మీ ఉద్దేశ్యం ఏమిటని అడగడం జరిగింది. మీ తండ్రికి...బిజెపి అంటే పడదు..రాష్ట్రంలో...క్రైస్తవులు..ముస్లింల్లో...మెజార్టీ ఓటర్లు మీ వైపే ఉన్నారు..నువ్వా పార్టీతో పరోక్ష పొత్తు పెట్టుకుని..ఎన్నికల్లో పోటీ చేశావని తెలిస్తే...అధికారంలోకి రావాలన్న నీ ఆశలు ఆడియాసలు అవుతాయని సలహా ఇచ్చారట. బిజెపితో పరోక్షపొత్తు ఉందని..బయటపడితే..'జనం' నాకు ఓటువేయరని..తెలుసు..ఇప్పటి పరిస్థితుల్లో అధికారం కైవసం చేసుకుంటానా...? లేదా...అన్నది అంతుబట్టడం లేదు. నామీద ఉన్న కేసుల వల్ల జాగ్రత్తగా ఉన్నాను..2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినా...2024 ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుస్తాను...నాకు..వయస్సు ఉంది..ఓపిక ఉంది...అప్పటికి 'చంద్రబాబు'కు ఓపిక నశిస్తుంది...ఆయన కుమారుడు 'లోకేష్‌' వల్ల తనకు భయం లేదు...ఇప్పుడు బిజెపికి ఎదురువెళితే...కోర్టు ఇచ్చిన బెయిల్‌ క్యాన్సిల్‌ అవుతుంది...'జగన్‌' చెప్పారట. అంతే కాకుండా..తనపై ఉన్న కేసులను సెటిల్‌ చేసుకుని ఏదో విధంగా బయటపడాలి..ఏ ఒక్క కేసులో శిక్ష పడ్డా ఎన్నికల్లో పోటీ చేయలేను..ఇప్పటికే పార్టీని బతికించాలంటే సతమతమవుతున్నాను..పార్టీ నాయకులు...ఎమ్మెల్యేలు..పార్టీ మారి టిడిపిలో చేరారు. మిగతా వారిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాను. ఓటర్లకు ఆశలు పెరిగాయి...నాయకులకు కోరికలు పెరిగాయి...పొరపాటున నాపై కేసుల వల్ల జైలుకు వెళితే పార్టీ పరిస్థితి ఏమిటి..? అధికారం రాకపోయినా ఫర్వాలేదు..కానీ...జైలుకు వెళితే..తన పరిస్థితి ఏమిటని...'జగన్‌' మనసులో మాట ఆ పెద్దమనిషికి చెప్పారట. పాదయాత్ర చేస్తోంది..పార్టీని బతికించుకోవడం కోసమేనని...2019 ఎన్నికలు టార్గెట్‌ కాదు..2024 టార్గెట్‌ అని చెప్పినట్లు వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. పది పదిహేను రోజుల మధ్య వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..దానిని వైకాపా నాయకులు కొందరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. 

  దీనిని బట్టి...కేసుల్లో శిక్షపడి...జైలులో ఉండే కన్నా...బిజెపికి సహకరించి..బయటఉండడమే మిన్నగా 'జగన్‌' భావిస్తున్నట్లు తెలుస్తోంది. కీ.శే.పి.వి.నర్సింహ్మారావు ఒక సందర్భంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కలసి...తన బాధను చెప్పుకుని..రాజకీయంగా సహకరించండి...లేకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు..అని చెప్పారట. దానికి పివి స్పందిస్తూ..ముందు నువ్వు బయట ఉంటే నన్ను కాపాడలేవు..నేను బయట ఉంటే...జైలు నుంచి తీసుకువస్తాను..అని చెప్పి..నమ్మించారు..ఆ వ్యక్తికి సహాయపడి బయటకు రప్పించారు. ఎన్నో సంవత్సరాల కిందట జరిగిన ఈసంఘటన ఎవరికీ తెలియదు. పివి చనిపోయే ముందు ఆ నాయకుడు ఈ విషయాన్ని బయటకు చెప్పారు. అదే విధంగా 'జగన్‌' కూడా తాను క్షేమంగా ఉంటేనే తప్ప...పార్టీ బాగుండేది..అందుకేనేమో...'మైనార్టీ ఓటర్లల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినా...2019 ఎన్నికల్లో గెలుస్తానా..గెలవనా..? అనే విషయాన్ని పక్కనపెట్టి...2024ను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అదీ నిజమే...అప్పుటికీ మోడీ ఉండడు...'చంద్రబాబు'...ఉండరు..ఏదైనా 'జగన్‌' తెలివితేటలకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.


(215)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ