WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సైకిల్‌యాత్రకు సమ్మర్‌ బ్రేక్‌...!

వివిధ జిల్లాల్లో సైకిల్‌యాత్ర ప్రారంభించిన నాయకులకు ఎండదెబ్బ తగిలి ఆస్పత్రి పాలవుతున్న నేపథ్యంలో ఈ సైకిల్‌ యాత్రకు సమ్మర్‌ బ్రేక్‌ ఇవ్వాలని 'చంద్రబాబు'ను పలువురు కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే..ఇద్దరు ఎమ్మెల్యేలు...ఒక ఎమ్మెల్సీ..సైకిల్‌ యాత్రలో ఎండ దెబ్బ తట్టుకోలేక విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో సైకిల్‌యాత్రకు కొన్నాళ్లు బ్రేక్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు పాదయాత్రలుకాదు..సైకిల్‌యాత్ర కాదు..గ్రామాల వారీగా..ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సీనియర్‌ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించి...వారిలో ఎవరెవరు ఆర్థికంగా దెబ్బతిన్నారు...రాజకీయంగా ఎవరు అన్యాయానికి గురయ్యారనే దానిపై దృష్టిపెడితే...ఫలితం ఉంటుందని సీనియర్‌ నేతలు చెబుతున్నారు. సైకిల్‌యాత్రల్లో వివిధ జిల్లాల్లో ఎక్కువగా ఊపు రాలేదన్నది యధార్థం. స్థానిక నేతలు కూడా అంతంత మాత్రంగానే ఈ యాత్రకు హాజరు అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఎమ్మెల్యేలు..కొన్ని కార్యక్రమాలు..భుజాన వేసుకోవడంతోసక్సెస్‌ అయ్యాయి. 

  రాజకీయంగా పెద్దగా మైలేజ్‌ రాకపోయినా...రాజకీయ నాయకులకు మాత్రం ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అయిపోయాయి. అందుకే...మండలాల వారీగా...కార్యకర్తలను కలుసుకుని వారి సాధక,బాధకాలను తెలుసుకోవాలని...అప్పుడే...ఉపయోగం ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే విషయంపై చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ మాట్లాడుతూ సైకిళ్లు ఇస్తున్నా... కార్యకర్తలు ఉత్సాహం చూపడం లేదని...దీన్ని 'చంద్రబాబు' మాత్రమే సరిచేయగలడని...ఆయన చిత్తూరు జిల్లా నాయకులకు చెప్పినట్లు బయటకు పొక్కింది. సైకిల్‌యాత్రపై కొంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో 'జనమ్‌ప్రత్యేకప్రతినిధి' స్వయంగా మాట్లాడగా...పెద్దాయన చేయమన్నారు..ఏదో చేస్తున్నాం..ఎన్నెన్నో పథకాలు..ప్రజలకు అందజేస్తున్నాం..సైకిల్‌యాత్ర ఎందుకో అర్థం కావడం లేదు. సొమ్ముపోయినా ఫలితం రావడం లేదు. దీనిపై అధినేత స్వయంగా మాట్లాడాలని వారు అంటున్నారు. ఎండకాలం రావడంతో..వడదెబ్బకు నీరసపడాల్సి వచ్చింది...అందుకే మొక్కుబడిగా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని..త్వరలో పూర్తిగా ఆపివేస్తామని చెప్పారు.


(80)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ