WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' తెగిస్తే...బిజెపి ఓడేది...!?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. గత కొన్నాళ్ల నుంచి జాతీయ రాజకీయనేతల నుంచి, సామాన్య ప్రజల వరకు...ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా బిజెపి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు..కర్ణాటక ఎన్నికల ఫలితాలే సూచికలని పలువురు రాజకీయ విశ్లేషకులతో పాటు...ఇతర వర్గాలకు చెందిన వారు వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో 'కర్ణాటక'లో గెలిచి మిగతా రాష్ట్రాల్లోనూ..తమ జెండా ఎగురవేస్తామని..బిజెపి నాయకులు ప్రగల్బాలు పలికారు. అయితే...ఇక్కడ...ఆపార్టీ పూర్తి మెజార్టీ సాధించడానికి...అపోసోపాలు పడుతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 112ను తాకలేకపోతోంది. ఇప్పటి వరకు 104 సీట్లలో మెజార్టీ సాధించింది. ఆ పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. అయితే...అసెంబ్లీలో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీగా గవర్నర్‌ ఆపార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తారని..బిజెపి నాయకులు చెబుతున్నారు. తమ కూటమికి మెజార్టీ ఉందని..తమనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని...కాంగ్రెస్‌,జెడిఎస్‌లు గవర్నర్‌ను కోరడానికి సిద్ధమయ్యాయి. 

   అయితే...మ్యాజిక్‌ ఫిగర్‌ సంగతి ఎలా ఉన్నా...కొంత మంది రాజకీయ విశ్లేషకులు...బిజెపిని ఓడించడానికి..దక్కిన అవకాశాన్ని కాంగ్రెస్‌తో పాటు..బిజెపి వ్యతిరేకులు కూడా చేతులారా చెడగొట్టుకున్నారంటున్నారు. ఎందుకంటే...జెడిఎస్‌ ఓట్లు చీలుస్తుందని మొదటి నుంచి భావించినా...ఆ పార్టీని తేలికగా తీసుకుని కాంగ్రెస్‌ నష్టపోయింది. అదే సమయంలో ముస్లిం,మైనార్టీ,ఎస్సీ,ఎస్టీల ఓట్లు చీలిపోవడం బిజెపికి కలసి వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే...మరో కీలకమైన మాట కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. కర్ణాటకలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లలో వచ్చిన చీలిక కూడా బిజెపికి కలసి వచ్చింది. దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం చూపించగలిగిన ఆంధ్రా ఓటర్లులో చీలిక...బిజెపికి బాగానే కలసి వచ్చింది. ఆంధ్రా ఓటర్లు...కొందరు..బిజెపిని సమర్థించడంతో..ఆ పార్టీ కనాకష్టంగానైనా వందసీట్లను తాకగలిగింది. అదే...ఆంధ్రా వాళ్లంతా..మూకుమ్మడిగా...కాంగ్రెస్‌ వైపు మొగ్గితే...బిజెపికి ఓటమి ఖాయం అయ్యేది. కానీ...కుల రాజకీయాలు...దానికి అడ్డం పడడం..'జగన్‌' బిజెపితో కలసి...కర్ణాటకలో ప్రచారం నిర్వహించడం, వారికి కావాల్సిన అన్ని రకాలు సహాయం చేయడంతో...ఆ మాత్రమైనా...బిజెపి సీట్లను సాధించగలిగింది. కాగా ఇక్కడో మాట కూడా వినిపిస్తోంది.

'చంద్రబాబు' దిగితే...!

ఆంధ్రాకు అన్యాయం చేసిన పార్టీలకు ఓటు వేయవద్దని...కర్ణాటకలో ఉన్న ఆంధ్రా ఓటర్లకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దానితో పాటు కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు, జర్నలిస్టులు వెళ్లి ప్రచారం చేయాలని భావించారు. అయితే...వీరు ప్రచారం నిర్వహిస్తే..తమకు ఎసరు వస్తుందని భావించిన...బిజెపి నాయకులు..అక్కడ ఉన్న 'రెడ్డి' సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి..తెలుగువాళ్లలో చీలిక తెచ్చారు. అంతే కాకుండా...ఆంధ్రా ఓటర్లను సంఘటితం చేద్దామని భావించిన ఉద్యోగసంఘాల నాయకులపై దాడి చేసి వారిని అక్కడ నుంచి పంపేశారు. దీంతో...తాము కాంగ్రెస్‌కు ఓటు వేస్తే...ఎన్నికల తరువాత..తమపై దాడులకు దిగుతారన్న భయంతో..తెలుగువారు కొందరు బిజెపిని సమర్థించారు. 

    అయితే...ఇప్పుడు అక్కడ ఉన్న ఆంధ్రా సంఘాలు, ప్రజలు...'చంద్రబాబు' ప్రచారానికి వచ్చి ఉంటే బాగుండేదని...అంటున్నారు. 'చంద్రబాబు' కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి ఉంటే...ఆపార్టీ ఓటమి పాలయ్యేదని...వారు చెబుతున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులుగా 'చంద్రబాబు' కనుక...తెగించి...ఇక్కడ ప్రచారం చేస్తే...బిజెపి పరాజయం పాలయ్యేదని... కానీ...'చంద్రబాబు' రాజకీయ విలువలకు కట్టుబడి...దానికి దూరంగా ఉన్నారని...ఒకవేళ ఆ విధంగా చేసుంటే...ఇప్పుడు పరిస్థితి మరో విధంగా ఉండేదని...కూడా వారు చర్చించుకుంటున్నారు. కనీసం ప్రచారం చేయకపోయినా..ఒక్కసారైనా...కర్ణాటకకు వచ్చి ఉన్నా..మరి కొందరు..తెలుగువారు.. బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరించేవారని...కానీ ఆ విధంగా జరగలేదని వారు నిట్టూరుస్తున్నారు. మొత్తం మీద...'చంద్రబాబు'..బిజెపిని ఓడించడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారనే మాట సర్వత్రా వినపడుతోంది.


(2084)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ