WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలుగోడు..బిజెపిని కుమ్మేశాడు....!

దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా..కన్నడ ప్రజలు చిత్రమైన తీర్పును ఇచ్చారు.  అధికార కాంగ్రెస్‌ పార్టీని ఓడించి...బిజెపికి మెజార్టీ సీట్లు ఇచ్చాడు. అయితే అనూహ్యంగా వారికి పూర్తి మెజార్టీ ఇవ్వకుండా...సామాన్య మెజార్టీకి 8 సీట్ల దూరంలో ఆపేశాడు. దీంతో...బిజెపి అధికార పీఠం ఎక్కడానికి నానా అగచాట్లు పడుతోంది. కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు సాధించి...అధికారపీఠం ఎక్కడానికి తమకు అడ్డేలేదని..భావించిన..బిజెపి నేతలకు..కన్నడ తెలుగు ప్రజలు గండి కొట్టారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో...బిజెపికి వారు చుక్కలు చూపించారు. దాదాపు 46 నియోజకవర్గాల్లో గెలుపుఓటములను నిర్దేశించే సత్తా ఉన్న తెలుగువాళ్లు బిజెపిని ఛీ కొట్టారు. ఆ పార్టీని కేవలం ఐదు సీట్లకే పరిమితం చేశారు.

    50వేల తెలుగు ఓట్లు ఉన్న దాదాపు 46 నియోజకవర్గాలను లెక్కలోకి తీసుకుంటే దీనిలో కాంగ్రెస్‌ పార్టీ 32 చోట్ల విజయం సాధించింది. అదే సమయంలో జెడిఎస్‌ కూడా 9 సీట్లు సాధించింది. బిజెపి మాత్రం నామ మాత్రంగా ఐదు సీట్లనుసాధించింది. దీన్ని బట్టి చూస్తే...తెలుగోడు...బిజెపిని ఎలా కుమ్మేశాడో...అర్థం అవుతోంది. సాధారణంగా తెలుగు ఓటర్లు మొదటి నుంచి బిజెపికే మద్దతు ఇచ్చేవారు. అనాదిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న తెలుగు ఓటర్లు..అదే ఒరవడిని మొన్నటిదాకా చూపించేవారు. కానీ...ఇటీవల కాలంలో రాజకీయంగా వచ్చిన మార్పులు..బిజెపికి తెలుగోడిని దూరం చేశాయి. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసిన బిజెపిపై అక్కడి తెలుగు ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. తమ ఓట్లన్నింటిని కాంగ్రెస్‌కు వేసి...నమ్మించి మోసం చేస్తే ఏమి చేస్తారో చేసి చూపించారు. అప్పటికీ...కాంగ్రెస్‌కు ఓటు వేయడం ఇష్టం లేని..మరి కొందరు జెడిఎస్‌కు వేశారు..తప్ప బిజెపికి మాత్రం ఓటు వేయలేదు. 

 బాగేపల్లి, బంగారుపేట,బళ్లారి, బీదర్‌,చిక్‌బళ్లాపూర్‌, కెజిఎఫ్‌, ముల్కల్‌, పారగడ్‌, సిద్ధఘడ్‌, శ్రీనివాస్‌పూర్‌ తదితర నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారు. అదే విధంగా చింతమావి, దేవనహళ్లి,కోలార్‌ నియోజకవర్గాల్లో జెడిఎస్‌ను గెలిపించారు. బళ్లారి సిటీలో మాత్రం బిజెపి అభ్యర్థి గెలుపొందారు. జిల్లాల వారీగా చూసుకుంటే...రాయచూర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఏడు స్థానాలు గెలవగా...బిజెపి రెండు స్థానాలకే పరిమితమైంది. కోలార్‌ జిల్లాలోనూ అదే ఫలితాలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌ ఐదు, బిజెపి మూడు స్థానాలు సాధించాయి. బల్లారిలో కాంగ్రెస్‌ తొమ్మిది స్థానాలు సాధించిగా బిజెపి మాత్రం మూడు స్థానాలు సాధించింది. చిక్‌బళ్లాపూర్‌లో కాంగ్రెస్‌ ఐదు సాధించగా...బిజెపికేమీ దక్కలేదు. అదే విధంగా కోలార్‌లోనూ కాంగ్రెస్‌ ఆరు స్థానాలు గెలుపొందగా.. బిజెపికి గుండు సున్నానే మిగిలింది. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న చోట్ల...బిజెపిపై వారు తమ ప్రతాపం చూపించారు. ఆంధ్రా ప్రభావం కర్ణాటకపై ఏమీ ఉండదని...కర్ణాటకలోని తెలుగు ప్రజలు...తమ స్వంత నిర్ణయం తీసుకుంటారని చెప్పిన ఆంధ్రా బిజెపి నాయకులు...ఇప్పుడు వచ్చిన ఫలితాలతో..ఖంగుతింటున్నారు. కాగా 'పురంధేశ్వరి' ప్రచారం చేసిన చోట...బిజెపి మూడోస్థానానికి పరిమితమైంది. దీన్ని బట్టిచూస్తే...ఆంధ్రా ప్రజల్లో బిజెపిపై ఎంత మంట ఉందో స్పష్టంగా అర్థం అవుతోంది.


(450)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ