WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్నాటక...తెలుగోడి దెబ్బకు..'జగన్‌,పవన్‌'లు గప్‌చుప్‌...!

అబ్బ...ఈ రోజు ఉదయం పూట....'జగన్‌' పార్టీ నాయకుల మొహాలు ఎలా వెలిగిపోయాయి...! తామే...గెలిచినట్లు...తమ నాయకుడు 'జగన్‌' ముఖ్యమంత్రి అయిపోయినట్లు...ఒకటే...ఉత్సాహం... ఆనందం....తమ రహస్యస్నేహితుడు 'కర్ణాటక'లో కుమ్మేస్తున్నాడని మురిసిపోయారు. తొలి ఫలితాల్లో..కర్ణాటక తెలుగువారంతా...బిజెపికే ఓటు వేశారనే సమాచారం రావడంతో...వారిలో ఉత్సాహం ఉరకలు వేసింది. బిజెపిపై తెలుగువారికి పెద్దగా..కోపం లేదని...అందుకే తమ రహస్యమిత్రులకు ఇటువంటి ఫలితాలు వస్తున్నాయని 'జగన్‌' అండ్‌ కో ఆనందంతో చిందులు వేశారు. మధ్యాహ్నం వరకు...అదే సందడి...! ఇంకేముంది...ఆంధ్రాలో కూడా..తమదే అధికార మనే...భావన...! వచ్చే ఎన్నికల్లో...బిజెపితో కలసిపోటీ చేసినా...గెలుస్తామనే...ధైర్యం...! అప్పటికి ఇంకా ఫలితాలు తారు మారు కాలేదు...! వైకాపా రాజ్యసభ సభ్యుడు...విజయసాయిరెడ్డి...ఫోజులు కొడుతూ...తమకు జాతీయరాజకీయాలపై ఆసక్తిలేదని...తాము..రాష్ట్రంలోనే..ఉంటామని...అక్కడ తమ మిత్రులు గెలిచారనే సంబరంతో మీడియాతో సంబరాలు చేసుకున్నారు. 

 మరోవైపు...జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' కూడా అదే రీతిలో ప్రకటనలు గుప్పించారు. చంద్రబాబు స్వంత జిల్లాకే న్యాయం చేయడం లేదని..ప్రజలు ఎన్నికల్లో తడాఖా చూపిస్తారని... అన్యాపదేశంగా...తమ రహస్యస్నేహితుడి విజయం గురించి ప్రస్తావించారు. కానీ...కర్ణాటకలో తెలుగుఓటర్లు ఏమి చేశారో...వారికి సాయంత్రం వరకు అర్థం కాలేదు. అధికారం తమ స్నేహితులకు వరించిందనే..వార్తలు వస్తున్నా...సీట్లు...వంద నుంచి ముందుకు కదలకపోవడంతో...అసలేమైందో.. వారికి సాయంత్రం వరకు అర్థం కాలేదు. కర్ణాటకలో తెలుగువాళ్లు కొట్టిన దెబ్బకు గెలుపు వాకిట ముందు బిజెపి బొక్కబోర్లాపడిందని...ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటేనే...కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని...తేలిపోయింది. దీంతో..ఉదయం నుంచి ఒకటే సంబరపడిన..'జగన్‌,పవన్‌'బ్యాచ్‌లు సాయంత్రానికి చల్లగా జారుకున్నాయి. తెలుగువాళ్లు అధికంగా ఉన్న చోట్ల...బిజెపిని నేలకేసి కొట్టారనే వార్తలు...'జగన్‌,పవన్‌'లను ఉలిక్కిపడేలా చేశాయి. వాస్తవానికి కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి 'జగన్‌,పవన్‌'లు బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నారు. ఒకవైపు తాము కేంద్రంతో పోరాటం చేస్తున్నామని చెప్పుకుం టూనే...కర్ణాటకలో బిజెపికి సహాయంగా తమ పార్టీ సీనియర్‌ నాయకుడు 'విజయసాయిరెడ్డి'ని బెంగుళూరు పంపించి..తాము ఎంత కుమ్ముక్కు రాజకీయాలను నడుపుతున్నారో ప్రత్యక్షంగా అందరికీ అర్థం అయ్యేలా చేశారు. పైగా తాము బిజెపికి మద్దతు ఇవ్వడం లేదంటూ...దబాయింపు ప్రకటనలు చేశారు. మరోవైపు..బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని..ప్రచారం చేయడానికి వెళ్లిన ఉద్యోగసంఘాల నాయకుడు, జర్నలిస్టులపై 'జగన్‌' తన మనుషులతో దాడులు చేయించారు. ఇదంతా...బిజెపి కోసం...'జగన్‌' పడిన పాట్లే...తాను చేసిన పనికి తగిన ప్రతిఫలం వస్తుందని భావించిన 'జగన్‌'కు ఆఖరులో తెలుగోడు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగింది. బిజెపికి కర్ణాటకలోనే... తెలుగోడు ఈ విధంగా దెబ్బ కొడితే...రేపు ఆంధ్రాలో ఏమవుతుందో తలచుకుంటునే...'జగన్‌'కు పై ప్రాణాలు పైనే పోతున్నట్లైంది. మోసం,వంచన చేసిన పార్టీతో అంటకాగుతున్నందుకు...రేపు..ఆంధ్రా ప్రజలు కూడా ఇదే తీర్పు ఇస్తారన్న సంగతి తెలుసుకున్న 'జగన్‌,పవన్‌' బ్యాచ్‌కు చెందిన వారి నోళ్లు ఒక్కసారిగా గప్‌చుప్‌ అయిపోయాయి.  


(3229)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ