WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పాపం...సాయికుమార్‌'....!

ఆయనో సినిమా నటుడు. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. ఆయనకు రాజకీయాలంటే అమితాసక్తి...! ముఖ్యంగా బిజెపి పార్టీ అంటే ఎంతో ప్రేమ. ఆ పార్టీతోనే తాను ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధుల సభకు రావాలని ఎన్నాళ్ల నుంచో...వేచి చూస్తున్నారు. ఆ పార్టీ కూడా మనోడి.. ప్రేమను అర్థం చేసుకుని..మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయించింది. కానీ ప్రతిసారీ...ఆయనకు ఓటమే ఎదురైంది. ఈ సారీ అదే జరిగింది. గతంలో కొద్ది తేడాతో ఓడిపోయిన...ఆయనకు ఈసారి డిపాజిట్‌ రాలేదు...దీంతో...పాపం..ఆయనకు రాజకీయాలు కలసి రాలేదని..అటు సినీజనం...ఇటు రాజకీయనాయకులు...ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ...ఆ సినీనటుడు ఎవరో చెప్పలేదు...కదా...ఆయనే....డైలాగ్‌ కింగ్‌ 'సాయికుమార్‌'.

   సినీనటుడిగా...కంటే డబ్బింగ్‌ ఆర్డిస్టుగానే ఆయనకు ఎక్కువ పేరుంది. డైలాగ్‌కింగ్‌గా ఆయనకు ప్రత్యేకమైన పేరుంది. ముఖ్యంగా అరవ సినిమా నటులకు డబ్బింగ్‌ చెప్పడంలో 'సాయికుమార్‌' తీరేవేరు. ఆయన డైలాగ్‌ చెప్పకుంటే...వాళ్లు సినిమా రిలీజ్‌కు కూడా ఒప్పుకునేవారు. ముఖ్యంగా సినీనటుడు రాజశేఖర్‌...'సాయి' డైలాగ్‌ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. కేవలం డైలాగ్‌లే కాదు..పోలీసు అధికారిగా...దేశభక్తుడిగా...'సాయికుమార్‌' పలుపాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. నాలుగో సింహం అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌లు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో మారు మ్రోగుతూనే ఉంటాయి...అటువంటి 'సాయికుమార్‌'ను ఓటర్లు మాత్రం కరుణించడం  లేదు. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మరోసారి ఘోరఓటమిని పొందారు 'సాయికుమార్‌'.

   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందే మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని డైలాగ్‌కింగ్‌ 'సాయికుమార్‌' భావించి...'గాలి జనార్థన్‌రెడ్డిని పట్టుకుని టిక్కెట్‌ సాధించుకున్నారు. బళ్లారి జిల్లాలోని 'బాగేపల్లి' నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. గతంలో ఆయన ఇక్కడ నుంచే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతితో పాటు... ఈ నియోజకవర్గం 'సాయికుమార్‌' తల్లికి స్వంత ఊరు కావడంతో కలసి వస్తుందని అంచనా వేసుకున్నాడు. పైగా ఇక్కడ దాదాపు అందరూ తెలుగువాళ్లే. దీంతో..ఈసారి ఎట్టి పరిస్థితులోనైనా తాను గెలుస్తానని 'సాయికుమార్‌' ధీమా వ్యక్తం చేసేవారు. 

  ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన 'గాలి' బ్యాచ్‌తో కలసి ప్రచారం చేశారు. 'గాలి' సామాజిక వర్గానికి చెందిన వారంతా బిజెపికి అండగా ఉండడం, తెలుగువారు..ఎక్కువగా ఉండడంతో..తన గెలుపు తధ్యమని ఆయన భావించారు. అదే సమయంలో ఆంధ్రాకు బిజెపి అన్యాయం చేయలేదని... న్యాయమే చేసిందని...ఆయనవాదించారు. తెలుగువారు దీనిపై చర్చకు వస్తే..తాను నిరూపిస్తానని...సవాల్‌ విసిరారు. ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు...బాగానే సొమ్ములు వెదజల్లారు. ఓటుకు వెయ్యి నుండి ఐదువేల వరకు పంచి స్థిమిత పడ్డారు. ఇక తన గెలుపును ఎవరూ ఆపలేరని..సన్నిహితులతో వ్యాఖ్యానించారు. కానీ...ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత... ఆయన సొమ్మసిల్లి పడిపోయారట. ఓడిపోతే...తనకేం కొత్తకాదని...భావించేవాడిని కాని...ధరావత్తు పోవడమేమిటని..ఆయన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ ఎన్నికల్లో ఆయన కేవలం 4వేల ఓట్లను మాత్రమే సాధించారట. మొత్తం మీద..రాజకీయాలంటే...సినిమాల్లో చెప్పే పంచ్‌ డైలాగ్‌లు కాదని...మనోడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో...అని సినీనటులు ధీర్ఘాలు తీస్తున్నారట. మరి మనోడికి..ఈ మాటలు వినిపిస్తాయా..? ఏమో...?


(3134)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ