WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' జైలుకే అంటున్న వైకాపా కార్యకర్తలు...!

అవును.....పై వ్యాక్యాన్ని మీరు సరిగానే..చదివారు...దానిలో వ్యాకరణ దోషాలో...అక్షర దోషాలో లేవు...! వైకాపాకు చెందిన నాయకులు వేసిన ఓ పోస్టర్‌లో ఇదే ఉంది. మన రాజన్న బిడ్డకు... జై...జైలు...అంటూ పోస్టర్‌ ముద్రించారు. పోస్టర్‌ వేసిన వారి ఉద్దేశ్యం వేరైనా...దాన్ని చూసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు...వైకాపా కార్యకర్తలు బాగానే అర్థం చేసుకున్నారు..త్వరలో వారి నాయకుడు మళ్లీ జైలుకు వెళతారని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. రాజన్నబిడ్డకు..జేజేలు..అని ముద్రించాల్సిన పోస్టర్‌లో...జై జైలు...అని ముద్రించడంతో...జైలు...అనేది ప్రత్యేకంగా కనిపిస్తోంది.దీన్ని ఆసరా చేసుకుని టిడిపి సోషల్‌మీడియా వైకాపా నాయకులను ఆడుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...ఆయన మంత్రివర్గ సహచరులు..ప్రతి శుక్రవారం కోర్టులో నిలబడే..'జగన్‌' నీతులు చెబుతారా..? అంటూ విమర్శలు చేస్తుంటే...తాజాగా..వైకాపా కార్యకర్తలు ముద్రించిన పోస్టర్‌లో తప్పులు...ఆ పార్టీకి ఇబ్బంది తెచ్చి పెట్టింది.


(1139)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ