WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబూ...మా బాధలు పట్టించుకోండి...!

సీనియర్‌ కార్యకర్తల లేఖ...!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా..పార్టీ కోసం లక్షల రూపాయల సొంత సొమ్మును ధారాళంగా ఖర్చుపెట్టి...ఆర్థికంగా దెబ్బతిన్న వారిని ఆదుకోవాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు..తమకు కావాల్సిన వారినే చేరదీస్తున్నారని..ఇప్పటికైనా వీరు..నిజం తెలుసుకుని పదేళ్లు అధికారంలో లేకున్నా..పార్టీ కోసం కష్టపడి..పనిచేసినవారిని ఆదుకోవాలని సీనియర్‌ కార్యకర్తలు కొందరు చంద్రబాబుకు లేఖ రాశారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం చాలా మందికి ఇచ్చారు. అందులో ఎక్కువమంది విజయం సాధించారు. వారిలో కొందరు మంత్రులు అయ్యారు..ఓడిపోయిన వారిని నియోజకవర్గ ఇన్‌ఛార్జిలుగా నియమించి..వారిని సూపర్‌ ఎమ్మెల్యేలుగా చేశారు. నామినేటెడ్‌ పదవులు ఇచ్చి కొంత మందిని సంతృప్తి పరిచారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రూ.200 ఉన్న ఫించన్‌ వెయ్యి రూపాయలు ఇచ్చి వారిని సంతృప్తిపరుస్తున్నారు. కాపు సంక్షేమ కార్పొరేషన్‌ ద్వారా, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా ఆ సామాజికవర్గానికి  చెందిన వారికి న్యాయం చేశారు. బిసి,ఎస్సీ,ఎస్టీలకు రుణసౌకర్యాలు కల్పించారు. చంద్రన్నభీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారని..ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవల ద్వారా చాలా మందికి ఆరోగ్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేసి వారి కన్నీళ్లు తుడిచారని, చంద్రన్న కానుకల ద్వారా అన్ని కులాల వారికి సేవలు అందిచారని, తాజాగా పెళ్లి చేసుకునే వారికి కానుకలు అందిస్తున్నారని...ఇదంతా ఒకెత్తు అయితే..ఎన్నికలకు ముందు పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి, విపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు..ఇవన్నీ బాగానే ఉన్నాయి...ఆర్థికపరంగా నష్టపోయిన వారందరికీ పట్టించుకోవడం లేదు. అటువంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వారికి ఉన్న అభిలాష తెలుసుకుని..చేతనైన సహాయం చేస్తే..వారికి చేయూత ఇచ్చిన వారవుతారు..పార్టీలో ఉన్న నేతలు..పార్టీలు మారారు..మళ్లీ తిరిగి వచ్చారు..మంత్రులయ్యారు. అప్పటి నుంచి...ఇప్పటి వరకు పదవులు ఉన్నా లేకున్నా...ఆర్థికంగా దెబ్బతిన్నా..కొనసాగుతున్నామని..తమకు ఏమీ ఇచ్చినా...ఇవ్వకున్నా...టిడిపి పార్టీని అంటిపెట్టుకునే ఉన్నామని...ఇప్పటికైనా న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. వివిధ జిల్లాలో పార్టీ కోసం పనిచేసి నష్టపోయిన వారిని ఆదుకోవాలని...గుంటూరు జిల్లాకు చెందిన కార్యకర్తలు..కొందరు..ఇతర జిల్లాలకు చెందిన నాయకులు..రాయడం జరిగింది. ఆ లేఖను చంద్రబాబు కానీ...చినబాబు కానీ...చూశారా..? లేదా..అనే విషయం బయటపడడం లేదు. ఏది ఏమైనా నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని మరో పదేళ్ల వరకు పార్టీ అధికారానికి ఢోకా ఉండదు. ఆ విధంగా లేఖ రాసిన వారు మీడియాతో మాట్లాడుతూ తమ బాధను, ఆవేదన వ్యక్తం చేసేమే తప్ప..ఎవరో ఆదుకుంటారనే అనుకోవడంలేదని..తమను సీనియర్‌ కార్యకర్తలుగా గుర్తించినా..అదే పదివేలు..త్వరలో ఎన్నికలు..రానున్నాయని..తమసేవలను 'చంద్రబాబు' గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ...ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారా..అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ