WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విష్ణుకుమార్‌రాజూ'..సైజుకు తగ్గ మాటలు మాట్లాడు...!??

తెలుగుదేశం పార్టీలో పొత్తు కాలం 'చంద్రబాబు' ఇంద్రుడు, అపారపరిపాలనాధక్షుడు, రాష్ట్రాన్ని ఆయనే అభివృద్ధి చేస్తాడు..అని ఇంటా బయటా పొగడ్తల వర్షం కురిపించిన బిజెపి నాయకుడు విష్ణుకుమార్‌రాజు మంగళవారం ఉదయం కర్ణాటక ఫలితాలు పూర్తిగా వెలువడ ముందే వ్యాఖ్యానిస్తూ...సిఎంను నిర్ణయించేది బిజెపియేనని...వ్యాఖ్యానించారు.  మళ్లీ సాయంత్రానికి చల్లపడి...'చంద్రబాబు' ప్రభావం తెలుగుఓటర్లలో వ్యక్తం అయిందని..దానితో సుమారు 27 సీట్లు బిజెపి కోల్పోయిందని ఆయన ఆఫ్‌ ది రికార్డుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒత్తిడి పనిచేయలేదు..ఎన్‌జిఒ సంఘాల నాయకుల ఒత్తిళ్లుపనిచేయలేదని వ్యాఖ్యానించిన విష్ణుకుమార్‌రాజు తరువాత మళ్లీ కనిపించలేదు. బిజెపి ఎమ్మెల్సీ మాధవ్‌, సోము వీర్రాజులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇంకేముంది...'చంద్రబాబు' పని అయిపోయింది...విష్ణు అంతా చెప్పేశారు...ఎపిలో తమ సహాయ,సహకారాలులేకుండా..ఏ పార్టీ అధికారంలోకి రాదు..అని..చేసిన విమర్శలు, ఆరోపణలు సాయంత్రానికి కల్లా తారుమారయ్యాయి. 

  'చంద్రబాబు'ను దూరం చేసుకున్నామని...ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాయకులు..అధిష్టానాన్ని తప్పుపట్టించారని...కర్ణాటకలో ఈపరిస్థితిరావడానికి కారకులయ్యారని..ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని నియమించేది బిజెపి నాయకులేనని చంకలు గుద్దుకున్న ఈ నాయకులు..రాష్ట్రంలో ఒక్క ఎంపిసీటునైనా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా గెలవగలరా..? ఎప్పుడు ఎన్నికలు జరిగిన..టిడిపికే ప్రజలు పట్టం కడతారని బిజెపి నాయకుల పరోక్ష సంభాషణలో అంగీకరిస్తున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా..ఎర్రనోట్లు వెదజల్లినా..ఎపిలో టిడిపిని ఓడించడం అంత తేలిక కాదని..అనుభవ పూర్వకంగా వారికి తెలిసి వచ్చింది. నిన్నటి వరకు 'చంద్రబాబు' సహాయంతో అనేక పనులు చక్కపెట్టుకున్న 'విష్ణు'పై టిడిపి దాడికి సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యేలు,మంత్రులను అవినీతి పరులు అని విమర్శస్తున్న విష్ణుకుమార్‌రాజు..రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తి ఎంత..? ఇప్పుడున్న ఆస్తి ఎంత అనేదానిపై చర్చ జరుగుతోంది. విషయం తెలిసిన మాజీ మంత్రి మాణిక్యాలరావుమౌనం వహిస్తూ ఇంట్లో కాలం గడుపుతున్నారు. ఏది ఏమైనా కర్ణాటక ఫలితాలు చంద్రబాబును హీరోను చేశాయని బిజెపి నాయకులు చెబుతున్నారు. టిడిపి సహాయంతో తాము ఎమ్మెల్యేలుగా విజయం సాధించామనే విషయం తెలిసినా కూడా..'జగన్‌,పవన్‌'లతో పొత్తు పెట్టుకుని మళ్లీ ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తామని...భావిస్తోన్న వీరందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే విమర్శలు, ఆరోపణలు చేసే ముందు మనమేమిటి..? మన పరిస్థితి ఏమిటి..? అనేది రాజకీయాల్లో ఆలోచించాలి. తొందరపడి రాజకీయాల్లోవ్యాఖ్యలు చేస్తే...విష్ణుకుమార్‌రాజుకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది.

(192)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ