WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శత్రువును కొట్టే దెబ్బ ప్రజలకు తగలాలి..మనం కొట్టే దెబ్బ శత్రువుకు తగలాలి:చంద్రబాబు

శత్రువును కొట్టే దెబ్బ ప్రజలకు తగలాలి..మనం కొట్టే దెబ్బ శత్రువుకు తగలాలి..ధర్మరాజు చెప్పిన సూక్తిని 'చంద్రబాబు' పాటించారు. మోడీ,అమిత్‌షా ద్వయాన్ని రాజకీయంగా దెబ్బకొట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా 'చంద్రబాబు'ను వేధిస్తోన్న అమిత్‌షా, మోడీల ద్వయం చేసిన కుట్ర ప్రజలపై పడింది. దానిని 'చంద్రబాబు' అనుకూలంగా మలచుకుని ప్రజలకు ఆ కుట్ర తెలిపి..ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలకు పాకి..అయ్యో..పాపం..చంద్రబాబు..సెంటిమెంట్‌తో..మోడీ,షాలపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మొదటి బిజెపికి అనుకూలంగా వెలువడడం..ఆ ఫలితాలను చూసి 'చంద్రబాబు' విచారవదనంతో కనిపించారని, సాయంత్రానికికల్లా పూర్తి ఫలితాలు వెలువడడంతో...'చంద్రబాబు' ఇచ్చిన పిలుపుమేరకు బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవడంతో..రాజకీయంగా విజయం సాధించానని...వైకాపా అధినేత 'జగన్‌,పవన్‌'లు తెలుగువారి దృష్టిలో అప్రదిష్ట పాలయ్యారని భావిస్తున్నారట. తాను ధైర్యం చేసి నేరుగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్లయితే...బిజెపి మరో 30 సీట్లను కోల్పోయేదని...అనుకున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటర్లు...బ్రహ్మరథం పడతారని...పాదయాత్ర, బస్సుయాత్రలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరని 'చంద్రబాబు' చెబుతున్నారు. ఒకవైపు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న 'జగన్‌,పవన్‌'లు మౌనం దాల్చి..రాజకీయంగా వారు నష్టపోయారని 'చంద్రబాబు' భావిస్తున్నారు. వైకాపా నాయకులు, ఇతర ముఖ్యులు..బిజెపి అభ్యర్థులకు సహకరించడమే కాకుండా..పరోక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని బయటకు పొక్కింది. ఇది కూడా తనకు కలసి వస్తుందని 'బాబు' నమ్ముతున్నారు. ఇప్పటికైనా తాము తప్పుచేశామనే భావన'జగన్‌,పవన్‌'లు చెప్పడం లేదని...ఈ నేపథ్యంలో వారిద్దరిపై...ఏ విధంగా దాడి చేయాలా..? అనే దానిపై ఈ రోజు 'చంద్రబాబు' చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఎలా వెళ్లాలో..ఎవరెవరు..ఏమి చేయాలో..బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. 

  జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 'జనంప్రత్యేకప్రతినిధి'తో మాట్లాడుతూ... కర్ణాటక తెలుగుఓటర్లు 'చంద్రబాబు' మాటలను విశ్వసించి...రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా...25 పార్లమెంట్‌ స్థానాలు వస్తాయని తెలిపారు. మీ నియోజకవర్గంలో ఓటర్లు 'జగన్‌'కు బ్రహ్మరథం పట్టారని వార్తలు వచ్చాయి..కదా..అని ప్రశ్నించినప్పుడు..జగన్‌ పార్టీకి చెందిన నాయకులు మాత్రమే హాజరయ్యారని..తటస్తులు ఎవరూ రాలేదని ఆయన అన్నారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిని కలసి అభినందించడమే కాకుండా...మీరు బాహాటంగా ప్రచారం చేస్తే...బిజెపికి యాభై సీట్లు కూడా వచ్చేవి కాదని సన్నిహితులతో చెప్పారు. ఏది ఏమైనా టిడిపి మళ్లీ అధికారంలో రావడం ఖాయమని..'చంద్రబాబు'కు పొరుగు రాష్ట్రాల ఓటర్లే ప్రాధాన్యత ఇస్తే...స్వంత రాష్ట్ర ఓటర్లు మరింత ప్రాధాన్యత ఇస్తారని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు కుమారు శివరామ్‌ అన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే...నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారని...అధికారం కోసం యాత్రలు చేసే వారిని ప్రజలు పట్టించుకోరని..టిడిపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పీకర్‌ కోడెల వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలోని మెజార్టీ మంత్రులు కర్ణాటక ఫలితాల విషయంలో ఫోన్లు ద్వారా..స్వయంగానూ కలసి 'చంద్రబాబు'ను అభినందిస్తున్నారు. ఎపిలో మనకు ఎదురులేదు... తెలంగాణలోనూ సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. సిఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల రేపు తెలంగాణలో కూడా టిడిపి అధికారంలోకి రాకపోయినా...ప్రత్యర్థులను ఓడించి గౌరవప్రదమైన స్థానాలు వస్తాయని తెలంగాణ టిడిపి నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా అభినందించారు.

(282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ