WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పార్టీ ఫిరాయిస్తే....ఎమ్మెల్యేకు వందకోట్లు ఇస్తాం:బిజెపి ఆఫర్‌...!

కర్ణాటకలో అధికారంలోకి రావడానికి బిజెపి అపసోపాలు పడుతోంది. అధికార పీఠానికి దగ్గర వచ్చి..బొక్కబోర్లాపడ్డ..ఆ పార్టీ..మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేలను తన పంచన చేర్చుకునేందుకు అన్ని శక్తి,యుక్తులను వాడుతోంది. పార్టీ ఫిరాయించి..బిజెపిలో చేరితే..వంద కోట్ల రూపాయల సొమ్ముతోపాటు...మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్దపడుతుందని..ప్రచారం జరుగుతోంది. జెడిఎస్‌ నాయకుడు కుమారస్వామి తమ ఎమ్మెల్యేలను బిజెపి నాయకులు సొమ్ముతో, పదవులతో ఎరవేస్తున్నారని..వారి ఆటలు సాగవని హెచ్చరించారు. బిజెపి అధికార దాహంతో...ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడిందని...వారిని ఎలా అడ్డుకోవాలో..అడ్డుకుంటామని ఆయన తెలిపారు. తమ పార్టీకి అధికార దాహం లేదని...తాము ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని..దీనిలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో లౌకికశక్తులతో కలసి పనిచేస్తామని..బిజెపి మతకలహాలను సృష్టించి ఎన్నికల్లో లబ్దిపొందిందని..ఆయన ఆరోపించారు. మొత్తం మీద...తాము..శుద్దపూసలమని చెప్పుకునే బిజెపి నేతలు..ఇప్పుడు ఎమ్మెల్యేలను సంతలో పశువులనుకొన్నట్లు కొనేందుకు సిద్ధపడుతోంది. బిజెపికి చెందిన ప్రముఖనేతలంతా బెంగుళూరులో మకాం వేసి...కాంగ్రెస్‌,జెడిఎస్‌ ఎమ్మెల్యేలను లోబరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి ఏమి కావాలంటే అది ఇస్తామని నిసిగ్గుగా వ్యవహరిస్తూ..బేరసారాలు చేస్తున్నారు. మరి వారి బేరసారాలకు ఎమ్మెల్యేలు లొంగుతారో లేదో చూడాల్సి ఉంది.


(141)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ