WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హత్య కేసులో నిందితులు అరెస్ట్

కర్నూలు మే 16 (జనం ప్రతినిధి): డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులోని నిండుతులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ గోపినాధ్ జెట్టి. తెలిపారు. ఈ నెల 10 వ తేదిన రాత్రి 09.00 గంటల సమయం లో డాక్టర్ పోచా శ్రీకాంత్ రెడ్డి, S/o. డాక్టర్ శివ ప్రభాకర్ రెడ్డి (47 సం)ని కిడ్నాప్  చేశారు అనే రూమర్స్ ఫై వెతికిన బందుమిత్రులు మరియు డోన్ పోలీసులకు 11 వ తేదిన ఉదయం 08.00 గం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి శవమైనట్లు డోన్ మండల పరిధి లో ఉడుములపాడు ఊరి బయట గల చెరువు కాలవలో కనుగొన్నారు. పోలీస్ వారు మరియు మృతుని బంధువులు వెళ్లి చూడగా అక్కడ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తలకు బలమైనరక్త గాయములు అయి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు చనిపోయిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి  ప్రముఖ వెద్యుడు పోచ ప్రభాకర్ రెడ్డికి ఒక్కడే కుమారుడు కావడం వలన జిల్లా లోని ప్రజలలో అలజడి లేచింది. 11 వ తేదిన ఉదయం 09.30 గంటలకు శ్రీకాంత రెడ్డి భార్య పోలీస్ లకు కంప్లైంట్ ఇస్తూ తన భర్త చావుకు కారణం ఇన్సురెన్స్ క్లైమ్ కోసం ఇచ్చిన  డెత్ సర్టిఫికేట్  విషయంలోగాని లేక ప్రాపర్టీ విషయం లోగాని హత్య జరిగి ఉండవచ్చు అని తెలిపినది. పోలీసులు నేరస్థలాన్ని ప్రొటెక్ట్ చేసి, క్లూస్ టీం, టెక్నికల్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ను రంగంలోనికి దించి పరిశోదన ప్రాంభించారు. నేరస్థలం లో శ్రీకాంత రెడ్డి కి సంబదించిన స్టెతస్కోప్ మరియు ఒక తెల్లని 10 లిటర్ల ప్లాస్టిక్ క్యాన్ వాటిపై  రక్తపు. మరకలతో దొరికినవి. సంచలనంగా ఉన్న హత్య కేసు కావడంతో కర్నూలు రేంజ్ డిఐజి  ఘట్టమనేని  శ్రీనివాస్ మరియు  కర్నూల్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి నేరస్థలంను పరిశీలించి త్వరగా నేరస్తులను పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ గా కర్నూల్ జిల్లా ఓ.యస్.డి.  రవి ప్రకాష్ ను అతనికి తోడుగా  ఐదు టీంలను ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం అనగా 15వ తేదీ 6 గంటలకు నిందితులు మురారి నరసింహ అతని కొడుకు మురారి చంద్రశేఖర్ మరియు నరసింహ భార్య నాగరత్న లను కర్నూలు, హైదారాబాద్ జాతీయరహదారిపై ఉన్న పంచలింగాల వద్ద  పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

   హత్య కు గల కారణం నిందితులు సులభంగా గా డబ్బులు సంపాదించాలనే దురుదేశ్యం తో బజాజ్ అలియన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ని మోసం చేయాలనీ గత రెండు సం క్రిందట రెండు పాలసీ లు, ఒకటి 9,00,000/-  మరొకటి 8,00,000/- లకు తప్పుడు దృవీకరణ పత్రాలతో పాలసీ లు ప్రారంభించింది. సదరు పాలసీలను గుర్తు తెలియని మడ్డి సురేష్ అనే పేరుతో సృస్టించి, రెండింటికి ఒక్కొక్క కంతు చొప్పున కర్నూల్ ఎస్.వి. కాంప్లెక్స్ లోని బజాజ్ ఇన్సూరెన్స్ కంపెని బ్రాంచ్ లో కట్టారు. పాలసీ బాండులు వచ్చిన తరువాత కొంత కాలానికి మడ్డి సురేష్ చనిపోయినాడు అని, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చే ఒక్క డెత్ రిపోర్టు  2 వేల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. దాని ఆధారంగా డోన్ మున్సిపాలిటి నుండి మరణ ధృవీకరణ పత్రం పొంది దాని ఆధారంగా రెండు పాలసీల గడువు ముగిసిన తర్వాత రూ.34,00,000/-లు ఇన్సూరెన్స్ కంపెని ఇవ్వాలని  తన భార్య అయిన మురారి నాగరత్నను మడ్డి సురేష్ భార్య  గా చూపించి  అప్లికేషను పెట్టించారు. ఆ తరువాత  ఇన్సూరెన్స్  ఇన్స్పెక్టర్ ఎంక్వయిరీ చేసి, మడ్డి సురేష్ అనే వ్యక్తి లేడు అని, అతను పాలసీ లోని ఫోటోలో వున్న వ్యక్తి మురారి నరసింహ అని కనుకొని రిపోర్ట్ ఇవ్వడం వలన ఇన్సూరెన్స్ కంపెని వారు నరసింహకు డబ్బులు ఇవ్వలేదు.  అప్పడు నరసింహ తన భార్యచేత, తాను మడ్డి సురేష్ భార్య అని, తన భర్త మడ్డి సురేష్ చనిపోయినాడు అని తనకు రావలసినా మెచ్యరిటి డబ్బులు 34,00,000/- రూపాయలు ఇన్సూరెన్స్ కంపెని ఇవ్వాలని కర్నూల్  వినియోగదారుల కోర్ట్ లో కేసు వేశారు. ఆ కేసును  ఏప్రిల్ 16, 2018 వతేదిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సాక్ష్యం వలన కోట్టివేశారు.  అప్పుడు నిందితులు ఎ1, ఎ2, మరియు ఎ3 లు శ్రీకాంత్ రెడ్డిని చంపాలని కుట్ర చేశారు. చనిపోయిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చేసిన తప్పు గత 2 సంరాల క్రిందట డెత్ సర్టిఫికేట్ మడ్డి సురేష్ పేరుతో, నేరస్తుడు  మురారి నరసింహకు ఇవ్వడం, తరువాత దానిని పొరపాటున తప్పు ధ్రువీకరణ పత్రంగా ఇచ్చినాను అని కర్నూల్ వినియోగదారుల కోర్ట్ లో సాక్ష్యం చెప్పడం వల్లన నేరస్తుడు అత్యాశ తో, దుర్భుదితో వేసిన ప్లాన్ ప్రకారం 34,00,000/- రూపాయల కేసును కోర్ట్ కొట్టివేయడం వలన మరల సివిల్ కోర్ట్ లో అప్పీల్ చేసుకొంటే, డాక్టర్ ని సాక్ష్యానికి రాకుండా చేయాలని,  అతనిని చంపి పెట్రోల్ పోసి కాల్చివేసి ఆధారాలు లేకుండా చేసి, కోర్ట్ లో కేసు గెలవాలని, గెలిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి డబ్బులు .34,00,000/-రూపాయలు వస్తాయని గట్టిగా నమ్మి డాక్టర్ ని  ఎలగైనా చంపాలానే ఉద్దేశ్యం తో డాక్టర్ ని ఒక పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వాలని నమ్మించి, తేది 10.5.2018 రోజున సాయంత్రం 05.30 గంటలకు ఒక్క ఆటోలో నేరస్తులు మురారి నరసింహ మరియు అతని కొడుకు మురారి చంద్రశేఖర్ లు డాక్టర్ని పిలుచుకొని వెళ్లి రోకలిబండ తో వెనకవైపునుండి తలపై కొట్టి చంపివేశారు, 

  అనంతరం శవాన్ని కాలువలోనికి ఈడ్చుకొని  వెళ్లి కంప చెట్ల క్రింద ఎవరికీ కనబడకుండా దాచిపెట్టారు.  పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టాలని ప్రయత్నించారు  పెట్రోల్ క్యాన్ పై రక్తపు మరకలు అయినందున కొత్త క్యాన్ కోసం మరియు పెట్రోల్ కొరకు శవమును అక్కడే విడిచిపెట్టి రోడ్డుపైకి రాగా అక్కడ పోలీసు హైవే పెట్రోల్ వాహనం  ఉండటంతో అక్కడి నుండి అలాగే బస్టాండుకు వెళ్లి పోయారు. నిందితులు నేరానికి ఒక్క వారం ముందు డోన్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసిన డబ్బులను మూడు నెలల ముందుగానే ఫ్రీ మెచ్యూర్ డబ్బులు 16,300/- రూపాయలను తీసుకున్నారు. ఎందుకంటే నేరం చేసిన తరువాత ఇంక డోన్ కు రాకుడదని డబ్బులకు ఇబ్బంది లేకుండా  ఉండటం కొరకు  ముందుగానే ప్లాన్ గా డబ్బులు తేసేసుకున్నారు. దర్యాప్తులో నరసింహ అత్తగారు అయిన శేషమ్మను చనిపోయినట్లుగా చూపించి 4 లక్షల 10 వేలు క్లైమ్ పొందారు. అయితే సదరు శేషమ్మ బ్రతికే ఉండటం కొసమెరుపు. ఈ కేసు లోని ముద్దాయిలను త్వరగా అరెస్ట్ చేసినందుకు ఓ.ఎస్. డి. రవి ప్రకాష్ , డోన్ డి.ఎస్.పి. బాబా ఫకృద్దీన్ , డోన్ సి.ఐ.రాజగోపాల్ నాయుడు , డోన్ టౌన్ ఎస్.ఐ. శ్రీనివాసులు  మరియు వారి సిబ్బందిని  కర్నూల్ జిల్లా SP శ్రీ గోపినాథ్ జెట్టి అభినందించారు.

(221)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ