WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విజయసాయిరెడ్డి' నిరాధారం:బోండా

ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న విజయసాయిరెడ్డి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలకు, ఆరోపణలకు సీబీఐతో విచారణ చేయించుకోవచ్చునని..చంద్రబాబు ఇంట్లో వజ్రాలు ఉన్నాయని...ఆరోపిస్తున్నారు..దొరికితే...తీసుకోండి..ఒకవేళ ఇవన్నీ అభూతకల్పనలైతే...రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి...రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా...? టిటిడి సభ్యుడు..ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సవాల్‌ చేశారు. శ్రీవారికి సంబంధించి వజ్రాలు, ఇతర నగలు మాయమయ్యాయని...అవి చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని...ఏ ఆధారాలతో విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు..? కేంద్రం మీ చేతిలో ఉంది...సీబీఐ అధికారులతో తనిఖీలు చేయించుకోండి...? 12 కేసుల్లో ఎ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి మేధావులు, అర్హతలు ఉన్నవారు నిర్వహించాల్సిన పదవిని విజయసాయిరెడ్డి నిర్వహించే అర్హతలేదని...ముఖ్యమంత్రి చంద్రబాబును..విమర్శించే నైతిక అర్హత లేదని...ఈ ఆరోపణలు, విమర్శలు...ఉపసంహరించుకోకుంటే...టిటిడి సభ్యుడి హోదాలో ఉన్న తాను..విజయసాయిరెడ్డిపై క్రిమినల్‌ చర్యలతో పాటు..పరువునష్టం దావా వేస్తానని 'బోండా' హెచ్చరించారు. 

  ఎవరెవరు ఏ విధంగా అక్రమార్జన చేశారో ప్రజలకు తెలుసు..వేంకటేశ్వరస్వామికి... అపారభక్తుడైన చంద్రబాబును అకారణంగా విమర్శిస్తే..ఏదో ఒక సమయంలో మీకు శిక్ష వేస్తాడని ఉమ హెచ్చరించారు. ఏది ఏమైనా..విజయసాయిరెడ్డి చేసిన విమర్శలు...ఆధారాలు లేని ఆరోపణలతో అప్రదిష్టపాలు అవ్వడమే కాకుండా ప్రతిపక్షనాయకుడు 'జగన్‌' ప్రతిష్టను భ్రష్టుపట్టిస్తున్నారని వైకాపానాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు నివాసాలను, అధికార నివాసాలను తనిఖీలు చేయాలన్న విజయసాయిరెడ్డి...ఏ ఆధారాలతో విమర్శలు చేశారా..అన్నది...రాజకీయపరిశీలకు అంతుబట్టడం లేదు. కేవలం 12గంటలసమయం లోపే చంద్రబాబు నివాసాన్ని సోదా చేయాలని..దొరక్కపోతే విజయసాయిరెడ్డి రాజీనానామా చేస్తానని ప్రకటించడాన్ని తెలుగుదేశం వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి వ్యవహారం శృతిమించి రాగానపడిందని..నిన్న మొన్నటి వరకు కులపరమైన చిచ్చుపెట్టాలని విఫలమయ్యారు..తాజాగా..తిరుమల శ్రీవారి ప్రతిష్టకు నష్టం చేకూర్చడం ఖాయం.

(145)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ