లేటెస్ట్

ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే కేసులే...!

ఇక నుంచి జర్నలిస్టులు తాము రాసే వార్తలను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని రాయాల్సి ఉంటుంది. స్పష్టమైన ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఇబ్బందులు పాలుకావాల్సి వస్తుంది. ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా.. వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తామని ఉత్తర్వులను జారీ చేస్తూ జీ.ఓ.నెం. 2430ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఇకపై ఎవరైనా జర్నలిస్టులు ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే..వారిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఆయా శాఖల కార్యదర్శులకు వీరిపై కేసులు పెట్టే అధికారాలను ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. చాలా రోజుల నుంచి దీనిపై వార్తలు వస్తున్నా..జీఓ రాకపోవడంతో ప్రభుత్వం దీనిపై వెనక్కు తగ్గిందేమోనని జర్నలిస్టు సంఘాలు భావించాయి. అయితే ప్రభుత్వం తాను అనుకున్న ప్రకారం ఈ రోజు సదరు జీవో ను విడుదల చేసింది. 

ఇక మీదట ఏదైనాశాఖలో అవినీతి జరిగిందని జర్నలిస్టులకు తెలిసినా దాని గురించి రాయడానికి లేదు. అవినీతికి సంబంధించి రుజువులు చూపించాల్సి ఉంటుంది. రుజువులు చూపించిన తరువాతే వార్తను రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా సమాచారం తెలిసిందని వార్తలు రాస్తే కేసులు ఎదుర్కోవాల్సిందే. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన వార్తలను సదరు వార్తా పత్రిక లేక టీవీ మాధ్యమాలు లేక సోషల్‌మీడియాలో ప్రచురించాలన్నా..దానికి సంబంధించిన ఆధారాలు ఉండితీరాల్సిందే. స్పష్టమైన సమాచారం ఉన్నా...దానిని రాయడానికి ఆస్కారం లేదు. మొత్తం మీద..మీడియాను తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి అధికార వైకాపా ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయడానికి వీలు లేదనట్లుగా ప్రభుత్వవ్యవహార శైలి ఉంది. దీనిపై జర్నలిస్టు సంఘాలు ఏమి చేస్తాయో చూడాలి మరి.

(253)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ