WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిజెపి నేత ప్రకటన 'కెసిఆర్‌'ను ఇరకాటంలోకి నెట్టిందా...!?

'ఆంధ్రా'లో  'చంద్రబాబు'ను...తెలంగాణలో 'కాంగ్రెస్‌'ను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వమని... బిజెపి నేత...చేసిన ప్రకటన..రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన మాటలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టించుకుంటారో...లేదో కానీ...ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఇక్కట్లు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే...బిజెపి నేతలు ఆడించిన విధంగా 'కెసిఆర్‌' ఆడుతున్నారనే..మాట తెలంగాణలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో...తెలంగాణాలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వమన్న బిజెపి ప్రధాన కార్యదర్శి మాటల్లోని నిగుఢార్థాన్ని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. వారి మాటల ప్రకారం కాంగ్రెస్‌ కాకుండా...తెలంగాణలో ఇప్పుడున్న 'కెసిఆర్‌' ప్రభుత్వం రావాలన్నదే..వారి కోరికని...కెసిఆర్‌ తమ రహస్యస్నేహితుడనే విధంగా వారి మాటలు ప్రజల్లోకి వెళతాయని అంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో...కెసిఆర్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలికారు. అదే విధంగా....రాష్ట్రంలోని బిజెపి నేతలు కూడా కెసిఆర్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. పేరుకు తాము ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని బిజెపి నేతలు చెబుతున్నా..వాస్తవంలోకి వచ్చేసరికి 'టిఆర్‌ఎస్‌'కు 'బి' టీమ్‌గా ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ఈ నాలుగేళ్ల టిఆర్‌ఎస్‌ పాలనపై బిజెపి ఎప్పుడూ..ధ్వజమెత్తలేదు..పేరుకైనా విమర్శలు చేయడం లేదు. దానికి అనుగుణంగానే కెసిఆర్‌ కూడా...బిజెపి నేతలతో ఐకమత్యాన్ని పాటిస్తూ...వారికి సహకరిస్తున్నారు. అదే విధంగా బిజెపికి కేంద్రస్థాయిలో ఇబ్బంది వచ్చిన ప్రతిసారీ కెసిఆర్‌ వారిని ఆదుకుంటూ రహస్యస్నేహితుడిపాత్రను బాగానే పోషిస్తున్నారు. 

  కొన్ని నెలల క్రితం పార్లమెంట్‌లో ప్రతిపక్షాలన్నీ కలసి...అవిశ్వాస తీర్మానాన్ని ఇస్తే..దాన్ని అడ్డుకుంటూ..కెసిఆర్‌ ఎంపీలు..బిజెపికి సహకరించారు. అదే విధంగా తాజాగా...కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో...బిజెపిని గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడకుండా...జెడిఎస్‌కు పడేవిధంగా...వ్యూహాన్ని రచించి...కెసిఆర్‌ బిజెపికి సహకరించారు. అదే విధంగా బిజెపి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సందర్భంలో వారికి కెసిఆర్‌ సహకరించారు. కాగా...తాజాగా బిజెపి నాయకుడు చేసిన ఈ ప్రకటనతో..తెలంగాణలోని గెలుపు ఓటములను నిర్ణయించే ముస్లిం వర్గాల్లో ఆలోచన మొదలైంది. కెసిఆర్‌, బిజెపి కుమ్ముక్కు అవుతున్నారని..వారు భావిస్తే...వచ్చే ఎన్నికల్లో..వారంతా ఏకపక్షంగా కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో..కెసిఆర్‌ తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మరి బిజెపి నాయకుడు చేసిన ఈ ప్రకటన వల్ల కలిగిన నష్టాన్ని కెసిఆర్‌ ఎలా నివారించుకుంటారో చూడాల్సి ఉంది.

(463)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ