లేటెస్ట్

ఇక మిగిలింది నలుగురు ఐఏఎస్‌లే...!

'జగన్‌' ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టంది. దాదాపు 8 నుంచి 10 మంది వరకు తొలినాళ్లల్లో పోస్టింగ్‌ ఇవ్వకుండా అట్టిపెట్టినా..తరువాత కాలంలో ఒక్కొక్కరికీ పోస్టింగ్‌ ఇచ్చుకుంటూ వచ్చారు. పరిపాలన గాడిలో పడిన తరువాత మరి కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చింది. 'చంద్రబాబునాయుడు'సిఎంఒలో పనిచేసిన ముగ్గురు సీనియర్లకు పోస్టింగ్‌లు ఇవ్వని 'జగన్‌' ప్రభుత్వం తాజాగా ఇద్దరికి పోస్టింగ్‌లుఇచ్చేసింది. ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 'రాజమౌళి'ని కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి అనుమతి ఇవ్వగా, మరో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'సతీష్‌చంద్ర'కు ఉన్నతవిద్యశాఖ కార్యదర్శిగా నియమించింది. దీంతో ముగ్గురిలో కేవలం 'సాయిప్రసాద్‌'కు మాత్రమే పోస్టింగ్‌ రాలేదు. 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన 'సాయిప్రసాద్‌' పోస్టింగ్‌ కోసం మరికొన్నాళ్లు వెయిట్‌ చేయకతప్పని పరిస్థితి ఉంది. ఈయన కాకుండా  ఐ.శ్రీనివాస్‌ శ్రీనరేష్‌, కె.శ్రీనివాసరాజు, గుర్రాల శ్రీనివాస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది.  మరి వీరికి త్వరలోనే పోస్టింగ్‌లు ఇస్తారంటున్నారు. 

(429)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ