WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డిని తప్పించండి:వరదరాజులరెడ్డి

కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీనియర్లను అవమానిస్తూ...మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు రమేష్‌ చెప్పిన మాటలే వింటూ...కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని..ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతకు ముందు..సిఎం రమేష్‌ తన ప్రత్యర్థులతో చేతలు కలిపి పనులు చక్కపెట్టుకుంటున్నారని బాహాటంగా చెప్పిన 'వరదరాజులరెడ్డి' ఇప్పటికీ అదేమాటకు కట్టుబడి ఉంటున్నానని చెప్పారు. రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా పంపికై ఆయన వైకాపా కార్పొరేటర్లకు సహకరించడంపై మంత్రి సోమిరెడ్డి పట్టించుకోవడం లేదని...వరదరాజులరెడ్డి ఆరోపిస్తున్నారు. కడప జిల్లాలో పార్టీ నియోజకవర్గాల స్థాయిలో వర్గాలుగా... విడగొడుతున్నారని, ఈ విషయాన్ని 'సోమిరెడ్డి' దృష్టికి కూడా తీసుకెళ్లామని...ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న వాస్తవాలను 'చంద్రబాబు' కు వివరించలేదని కొన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

    తమ నాయకుడు 1983లో ఇంటిపెండెంట్‌గా ఓడిపోయినా...1985లో ఎన్టీఆర్‌ స్వయంగా పిలిచి టిక్కెట్‌ ఇచ్చారని తరువాత 1989,1994,1999,2004లో విజయసాధించి రికార్డు సృష్టించారని...తమ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 'సోమిరెడ్డి' చిన్నపిల్లవాడని, ఆయన మామ 'నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి'తో కలిసి తమ నేతను కలసేందుకు వచ్చారని 'వరదరాజులరెడ్డి' అనుచరులు చెబుతున్నారు. ఏది ఏమైనా...జిల్లాలో గ్రూపులను ఇన్‌ఛార్జి మంత్రి ప్రోత్సహిస్తున్నారని...ఇదే విధంగా కొనసాగితే 2014లో ఒక సీటు వచ్చిందని...ఈసారి అదీ రాదని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నాయకులందరినీ ఒకేతాటిపై నిలబెట్టి...ఎమ్మెల్సీని గెలిచిన జిల్లా నాయకులు..ఇప్పుడు ఎందుకు కీచులాడుకుంటున్నారో...తెలియదని వారు అంటున్నారు. నాయకులను ఒకేతాటిపై నడిపించడంలో మంత్రి సోమిరెడ్డి విఫలం అవుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

   'చంద్రబాబు'తో ఏకాంతంగా సమావేశమైన 'వరదరాజులరెడ్డి' వాస్తవాలు, జరుగుతున్న సంఘటనలు, మంత్రి ఆదినారాయణరెడ్డి నియంతృత్వ ధోరణిని వివరించినట్లు తెలిసింది. తనను అవమానపరిచినా సహిస్తున్నానని సిఎం రమేష్‌, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిలు కలసి శల్యరాజకీయం చేస్తున్నారని 'చంద్రబాబు'కు తెలపగా..ఏమైనా ఉంటే సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడండి...ఇన్‌ఛార్జి మంత్రి ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి..అని చెప్పగా...మంత్రి తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని 'వరదరాజులరెడ్డి' ఆవేశంతో చెప్పారట. ఒక సమయంలో ఇన్‌ఛార్జి మంత్రిగా సోమిరెడ్డిని తప్పించి.. ముక్కుసూటిగా వ్యవహరించే మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించండి..అని 'వరదరాజులరెడ్డి' సిఎంను కోరారని తెలుస్తోంది. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన 'వరదరాజులరెడ్డి' ఆయనతో ఉన్న చనవుతో...ఇంతకు ముందు 'బాబు' దృష్టికి రాని విషయాలను వివరించినట్లు సమాచారం.

(248)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ