WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గాడి' తప్పిన 'లోకేష్‌' పాలన..!

ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రంగప్రవేశం చేసిన 'లోకేష్‌' ఎమ్మెల్సీగా ఎన్నికై...పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా నియమితులయ్యారు. పంచాయితీరాజ్‌శాఖ నిర్వర్యం కావడానికి, అర్హతలు లేని వారిని అందలం ఎక్కిస్తూ..ఇష్టారాజ్యంగా నియామకాలు, బదిలీలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సచివాలయంలో పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ పేరుతో కొందరు మధ్యవర్తులు దోచుకుంటున్నారని, లక్షలు వసూలు చేస్తున్నారని కొన్ని పనులు చక్కపెట్టి, మరి కొన్ని పనులు చక్కపెట్టడం లేదని ఇంతకు ముందు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాలు ప్రచురించింది. అందులో 'సుబ్రహ్మణ్యం' అనే ట్రావెల్స్‌ యజమాని అనేక మంది దగ్గర పనులు చేస్తానని సొమ్ములు తీసుకుని పరారయ్యారు. మరొక మధ్యవర్తి అయిన 'పురుషోత్తంరెడ్డి' అనే వ్యక్తి...ఇప్పటికీ అక్కడ హడావుడి చేస్తున్నారు. కొందరికి పనులు చేసి పెడుతున్నారు..మరి కొందరికి అదుగో..ఇదుగో..అంటూ..చెబుతున్నారు. సచివాలయంలో ఈశాఖలో ఈయనగారి గురించి అడిగితే ఎవరైనా చెబుతారు. అంతే కాకుండా...కింది స్థాయి 'చిన్నసార్‌' ఒక గ్రూపును ఏర్పాటు చేసి..అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లతో మాట్లాడించి..పరోక్షంగా బెదిరిస్తూ..లక్షలు వసూలు చేస్తున్నారని బయటకు వచ్చినా..ఆ విషయం మంత్రి లోకేష్‌ దృష్టికి వచ్చిందో రాలేదో..తెలియదు. 

   ఇంతా..ఇటీవల కాలంలో జరిగింది. తరువాత...పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణశాఖ డైరెక్టర్‌గా నిన్న మొన్న ఐఎఎస్‌తో జాయింట్‌ కలెక్టర్‌ హోదాతో ఉన్న 'రంజిత్‌భాషా'ను ఆశాఖ డైరెక్టర్‌గా నియమించి...శాఖను నిర్వీర్యం చేసిన ఘనత 'లోకేష్‌'దే అనే విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా...ఆశాఖ కమీషనర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చారు 'రామాంజనేయులు'. ఇటీవల ఆ శాఖ డైరెక్టర్‌ రంజిత్‌భాషా ఒక జిల్లా కలెక్టర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా...ఆయన అందుబాటులోకి రాకుండా...జాయింట్‌ కలెక్టర్‌గా మాట్లాడాలని తన అంతరంగిక సిబ్బందికి చెప్పారట. 13 జిల్లా కలెక్టర్లు, అంత కన్నా జానియర్‌ అయిన 'రంజిత్‌భాషా'ను అత్యంత ప్రాధాన్యత కల, సీనియర్‌ అధికారి నిర్వహించాల్సిన పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖను నిర్వీర్యం చేశారని, పరిపాలనా వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంటే...తాజాగా...ఎక్సైజ్‌లో పనిచేసే అధికారిని డ్వామా పిడిగా నియమించారు మంత్రి లోకేష్‌. డ్వామా పిడిగా ఆర్‌డిఒ స్థాయి అధికారిని ఎండిఒగా అనేక సంసవత్సరాలుగా పనిచేసిన అధికారిని కానీ..డ్వామా పిడిగా నియమించే సాంప్రదాయం ఉంది. సాంప్రదాయాలు వద్దు...సీనియార్టీని పట్టించుకోరు. నాశాఖ నాయిష్టం..ఈ ప్రభుత్వం నాది...నేనేం చెప్పినా..చెల్లుబాటు కావాల్సిందే అన్న రీతిలో...మంత్రి లోకేష్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని...ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి ఎలా చెప్పాలో తెలియడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. 

  ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసు...ఆయనకు తెలియకుండా గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా 'రంజిత్‌భాషా'ను నియమించారా..? నాలుగేళ్ల నుండి శాఖాధిపతిగా పనిచేస్తోన్న 'జవహర్‌రెడ్డి'ని ఎందుకు బదిలీ చేయడం లేదు..? వాస్తవాలను మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లి..తస్మాత్‌ జాగ్రత్త అని చెప్పాల్సిన సన్నిహితులు స్వామి కార్యాలతో పాటు... స్వకార్యాలు కూడా చేయించుకుంటున్నారు. మంత్రి కార్యాలయంలో...ఫైళ్ల విషయాలు బయటకు పొక్కుతున్నాయని... తెలుస్తోంది. భవిష్యత్‌లో..'చంద్రబాబు' వారసుడిని తానే అని చెప్పుకుంటున్న 'లోకేష్‌' పంచాయితీరాజ్‌ విషయంలోనే సమర్థవంతంగా వ్యవహరించలేకపోయారని, ముందు ముందు ఆయనేం చేస్తారని సీనియర్‌ అధికారులు అంటున్నారు. సమర్థులు, నిజాయితీపరుల సేవలను సద్వినియోగం చేసుకుంటూ...ఎవరెవరిని ఎక్కడ నియమించాలో...ఇప్పటి వరకు మంత్రి లోకేష్‌ తెలుసుకోలేకపోతున్నారనేది యధార్థం. తన కార్యాలయ సిబ్బంది...నియామకంలో తప్పటడుగులు వేశారు..ప్రచార సిబ్బంది నియామకంలో తప్పటడుగులు వేశారు..అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల్లో సీనియార్టీకి విరుద్దంగా నియామకాలు చేసి వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే మంత్రిగా అప్రదిష్టపాలవుతున్నారు.

(496)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ