WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చిన్నపాటి శస్త్రచికిత్స కోసం వెళితే..దుష్రృచారం చేస్తారా..?

సిఎస్‌ 'దినేష్‌కుమార్‌' ఆవేదన...!

మోకాలకు సంబంధించిన చిన్నపాటి శస్త్రచికిత్స కోసం పదిహేను రోజుల పాటు సెలవుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ వెళ్లిన సంగతి చాలా మంది అధికారులకు తెలిసినా...ముఖ్యమంత్రి చంద్రబాబుతో తీవ్ర విభేదాలతో ఆయన సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం వెనుక కొందరు శాఖాధిపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యతిరేకిస్తోన్న సీనియర్‌ ఐపఎస్‌ అధికారులు, మరి కొంత మంది సీనియర్‌ అధికారుల హస్తం ఉన్నట్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తనను సిఎస్‌గా నియమించి సంవత్సరంపైగా అయిందని... సిఎంతో తనకు ఎటువంటి విభేదాలు రాలేదని, పరస్పర అవగాహనతో వాస్తవాలు ఆయన దృష్టికి తీసుకెళుతున్నానని..అందుకు ముఖ్యమంత్రి కూడా ఆమోద ముద్ర వేశారని...తనపై ఇటువంటి ద్రుషృచారం చేయడం బాధను కల్గిస్తుందని...ఆయనను కలిసిన సన్నిహితులు చెబుతున్నారు. ముందుగా మోకాలకు శస్త్రచికిత్స చేయించుకుంటున్నానని..ఆయన ఎవరికీ చెప్పకపోవడంతోనే...ఈ విధమైన దుష్రృచారం జరిగింది. ఎప్పుడో మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉన్నా..పని ఒత్తిడితో...చేయించుకోలేదని...ఇప్పుడు సిఎంకు ఈ విషయం తెలిపి ఆయన హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన ఈ విషయాన్ని అతికొద్ది మంది సన్నిహితులకు మాత్రమే చెప్పడం వారు..ఈ విషయాన్ని...బయటకు చెప్పకపోవడంతో..అనేక రకాలైన ప్రచారాలు బయటకు వచ్చాయి. 

   సిఎంకు, సిఎస్‌కు పడడం లేదని, అనేక ఫైళ్లపై సిఎస్‌ సంతకాలు చేయనన్నారని, దానికి సిఎం ఆగ్రహం చెందారని...అందుకే...ఆయన సెలవుపై వెళ్లారని...రిటైర్డ్‌ ఐఎఎస్‌ బృందం ప్రచారం చేసింది. వారు ఈ విధంగా చేస్తారని 'దినేష్‌' తెలుసుకోలేకపోయారు. పారిశ్రామికవేత్తలు కానీ, విద్యాసంస్థలకు కానీ, ఆసుపత్రులు నిర్మించుకునేందుకు కానీ...భూములు కేటాయించి ఎంత ధర నిర్ణయించాలనే విషయం...మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకుంటారే కానీ...కలెక్టర్లు, శాఖాధిపతులు, ప్రధాన కార్యదర్శులు ఎటువంటి సిఫార్సు చేసినా..అంతిమంగా నిర్ణయం తీసుకునేది మంత్రివర్గమే. ఈ భూముల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా...మంత్రివర్గభేటీలో పెడుతుంటారు. ఎవరికి ఎంత భూమి కేటాయించాలనే విషయంపై కలెక్టర్లు, శాఖాధిపతులు సంబంధిత ఫైళ్లపై రాస్తారు. కానీ విధానపరంగా నిర్ణయాలు తీసుకునేది మంత్రివర్గమే అని విషయం...అందరికీ తెలుసు. కానీ...ఆ అధికారి వ్యతిరేకంగా రాశారని...సిఎం చంద్రబాబు అతితక్కువ ధరకు కేటాయించారని..పలు పత్రికలు కథనాలు రాయడంతో...సిఎం,సిఎస్‌కు మధ్య విభేదాలు వచ్చాయనే విధంగా ప్రచారం జరుగుతోంది. 

  శాఖాధిపతులు, కలెక్టర్ల బదిలీలు పోస్టింగ్‌ల్లో సిఎస్‌, సిఎం, సిఎంఒ కార్యాలయ అధికారి సతీష్‌ చంద్రలు సమావేశమై...ఎవరిని ఎక్కడ నియమించాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తున్నారు. దీనిలో కొన్ని సిఫార్సులను సిఎం ఆమోదించవచ్చు...ఆమోదించకపోవచ్చు..అంత మాత్రాన ఆయనతో విభేదాలు అని...పత్రికలు ప్రచురిస్తే...సిఎస్‌ 'దినేష్‌'కు సంబంధం ఏమిటి..? ఏది ఏమైనా చిన్నపాటి..విషయాన్ని.. అప్పటికప్పుడు...నిర్ణయం తీసుకుని సెలవుపై వెళ్లడం..ఇటువంటి దుష్రృచారానికి అవకాశం ఇచ్చినట్లైంది. నేనెప్పుడు సెలవుపై వెళ్లాలి...శస్త్రచికిత్స చేయించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకునేది తానే తప్ప..దుష్రృచారం చేసే మాజీ ఐఎఎస్‌ అధికారులు కాదని..'దినేష్‌' కొంత మంది సన్నిహితులతో ఆగ్రహంతో అన్నారని తెలుస్తోంది. ఎంత సిఎస్‌ అయినా..అనారోగ్య సమస్యలు రావా..? కుటుంబ సమస్యలు రావా...? హోదా పెద్దదయితే...ఇటువంటి వార్తలు రాస్తారా..? దుష్రృచారం చేసి బాధిస్తే ఎలా అని ఆయన వారితో అన్నట్లు తెలిసింది.

(345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ