WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'తాడో..పేడో..తేల్చుకోబోతున్న 'ఆదాల'...!

తమ నాయకుడు 'ఆదాల ప్రభాకర్‌రెడ్డి' అధినేత చంద్రబాబును కలిసిన కారణాలు వేరు..మంత్రులతో పాటు..మరి కొందరు చేసే ప్రచారం వేరేగే విధంగా ఆయన ప్రధాన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చంద్రబాబు'ను స్వయంగా కలిసిన 'ఆదాల' లిఖితపూర్వకంగా ఒక సమస్యను పరిష్కరించమని కోరారు..కానీ..ఇతర సమస్యల గురించి కానీ..మరే విధమైన మాటలు మాట్లాడలేదని వారు చెబుతున్నారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వివిధ నియోజకవర్గ బాధ్యతలను 'చంద్రబాబు' 'ఆదాల'కు అప్పగించారని...మంత్రి ఒకరు స్థానిక పత్రికలకు లీక్‌ ఇచ్చారని..అందులో ఎటువంటి నిజాలు లేవని వారు చెబుతున్నారు.ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న చర్చలు వేరు...జిల్లాలో వివిధ పత్రికలు ప్రచురిస్తున్న కథనాలు వేరని 'ఆదాల' ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదంతా మంత్రి సోమిరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్రయాదవ్‌లు ఒక పథకం ప్రకారం చేస్తున్నారని, వారు జరగని చర్చలు, ఇతర విషయాలను లీక్‌లు చేస్తున్నారని 'ఆదాల' భావిస్తున్నారు. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు 'ఆదాల' సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. 

   ఇప్పటికే...'ఆదాల' నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో తప్ప..ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టడం లేదు. 'ఆదాల' టిడిపిని వీడి...వైకాపాలో చేరతారని..ఒక మంత్రి పదే పదే లీకులు ఇవ్వడంపై సిఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. చర్చకు రాని అంశాలే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేటట్లు చేయడంపై మంత్రి ప్రమేయంపై 'ఆదాల' ఫిర్యాదు చేయబోతున్నారు. తాను టిడిపిని వీడి వైకాపాలో చేరే ప్రసక్తేలేదని, రాజకీయాలు మానుకుంటాను..కానీ...అప్రదిష్ట వచ్చే పనులు చేయనని..అనుమానాలు, అపార్ధాలు వదలి వాస్తవాలు చెప్పాల్సిన నాయకులు లేని పోని కథనాలను స్థానిక పత్రికల్లో రాయించారని 'ఆదాల' ముఖ్య ప్రతినిధి ఒకరు స్థానిక పత్రికలకు తెలిపారు. ఇదే విషయంపై తాడో..పేడో తేల్చుకునేందుకు 'ఆదాల' చంద్రబాబు టైమ్‌ కోసం చూస్తున్నారు. ఈ వారంలో కానీ...మరో వారంలోకానీ..ఆదాల స్వయంగా 'చంద్రబాబు'ను కలసి వాస్తవాలను తెలిపి..స్థానిక పత్రికలు ప్రచురించిన కాపీలను ఆయనకు అందజేయబోతున్నట్లు తెలిసింది.

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ