WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దొరతనం' కనిపించని 'దొరబాబు'...!

ఆయన టిడిపికి చెందిన సీనియర్‌ నాయకుడు. 'చంద్రబాబు'కు వీరవిధేయుడు. పార్టీపట్ల అత్యంత విశ్వాసం కల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇచ్చినా..ఇవ్వకపోయినా, ఇతర పదవులు చేయిదాడి పోయినా...'చంద్రబాబు'ను కానీ, పార్టీని కాని..బాహాటంగా విమర్శలు చేయని నాయకునిగా ఆయనకు పేరుంది. దొరతనంలేని దొరబాబుగా ఆయనను పలువురు పిలుస్తుంటారు..ఇటీవలే..ఎమ్మెల్సీ పదవి ఆయనను వరించింది. ఆయన పేరు రాజసింహులునాయుడు కాగా అందరూ ఆయనను 'దొరబాబు' అంటూ పిలుస్తుంటారు. 1985లో ఆయన చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పార్టీ పదవులు అనేకం నిర్వహించారు. 

  చంద్రబాబుకు విధేయుడు, నమ్మకస్తుడిగా, పార్టీపట్ల అంకితభావంతో పనిచేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం ఆయన చిత్తూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై వచ్చేవారి సమస్యలను పరిష్కరించే నాయకునిగా 'దొరబాబు'కు పేరుంది. ఆయన కార్యాలయానికి వెళితే...గౌరవ మర్యాదలతో పలకరిస్తారు...సమయాను బట్టి...ఆహారపదార్థాలను అందజేస్తారు. అవినీతి మచ్చ అంటని నేతగా 'దొరబాబు'కు పేరుంది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లో ఆయన కలుగచేసుకోరు. నిబందనల ప్రకారమే నడుస్తారు..విశ్వాసంగా పనిచేశారు..అందుకే ఎమ్మెల్సీ పదవి వచ్చిందని ఆయన ఆనందపడతారు. ప్రచార్భాటానికి దూరంగా ఉంటారు..పార్టీకి అందుబాటులో ఉంటారని పేరుంది. చిత్తూరు ఎమ్మెల్యేతో కానీ, ఇతర ముఖ్యులతో కానీ..ఆయన విభేదాలు లేవు. చిత్తూరు జిల్లాలో కీ.శే. గాలిముద్దుకృష్ణనాయుడుకు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో...'దొరబాబు'కు కూడా అంతే పేరు ప్రతిష్టలు ఉన్నాయి.

(232)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ