WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సుకుమార్‌' అవినీతికి ఐఎఎస్‌లు, మంత్రుల అండదండలు..!?

గిడ్డంగుల సంస్థలో అడ్వాన్స్‌లు తీసుకుని చెల్లించలేదని..ఆ సంస్థ ముఖ్య అధికారిపై చర్యలు తీసుకోవడంలో మంత్రి పత్తిపాటిపుల్లారావు, మరో మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు..సచివాలయంలో ఆశాఖను పర్యవేక్షించే ఉన్నతాధికారి, జిఎడి అధికారి, మరో ఉన్నతాధికారి ప్రమేయం ఉంది. ఇందులో సిఎం కార్యాలయ అధికారుల్లో ఒకరు స్వయంగా, మరొకరు పరోక్షంగా మద్దతు ప్రకటించారని తెలుస్తోంది. ఐదుగురు ఐఎఎస్‌ అధికారులు, ఇద్దరు మంత్రులు ఒక అవినీతి అధికారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారంటే..దీనిలో ఒత్తిడిలు పనిచేశాయా..? లేక కులం పనిచేసిందా..? అనే దానిపై సంస్థ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గిడ్డంగుల సంస్థకు ఐదారుకోట్లు నష్టం వాటిల్లే విధంగా నిర్ణయాలు తీసుకున్న అప్పటి ఎండి సుకుమార్‌ వ్యవహారశైలి బయటకు పొక్కినా..అప్పట్లో మంత్రి పుల్లారావు కానీ..ఆశాఖను పర్యవేక్షిస్తున్నా ఉన్నతాధికారి కానీ...సిఎం కార్యాలయ అధికారులు కానీ స్పందించలేదు. ఆధారాలతో లిఖితపూర్వకంగా 'సుకుమార్‌' తీసుకున్న నిర్ణయాలను వీరికి అందజేసినా...ఏ ఒక్కరూ ఆయనపై చర్య తీసుకునేందుకు ముందుకు రాలేదు. 

   మరి కొద్ది రోజుల్లో రిటైర్‌ కాబోయే 'సుకుమార్‌' వద్ద నుంచి ఆ సొమ్మును ఎలా వసూలు చేస్తారు..? ఏ విధంగా వసూళ్లు చేస్తారా..? సంస్థకు వాటిల్లిన నష్టంపై ఆయనపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. ఇదంతా ఒక గూడుపుఠాణిలా కనిపిస్తుందని..సిఎంఒ కార్యాలయ అధికారులు 'సుకుమార్‌' సహకరించారని, సంస్థ ఎలా పోతే నాకెందుకు..? నా పనులు సుకుమార్‌ చేస్తున్నారని అప్పటి మంత్రి పుల్లారావులు ఆలోచించి..'సుకుమార్‌'పై చర్యలు తీసుకోలేదని ప్రచారం జరుగుతుంది. 'సుకుమార్‌' అవినీతి, అక్రమాల గురించి సిఎం దృష్టికి ఏ ఒక్కరూ తీసుకెళ్లలేదు. ఐదు కోట్లు అడ్వాన్స్‌ రూపంలో తీసుకుని...చెల్లించకుండా..ఉంటే దానిపై చర్య తీసుకోవాల్సి ఉండగా..పట్టించుకోకుండా నిద్రపోయారని విమర్శలు వస్తున్నాయి. సంస్థ సొమ్ములను స్వంత సొమ్ము వలే వాడుకోవడం, సుకుమార్‌ కుటుంబ సభ్యులు..సంస్థను అడ్డగోలుగా వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సొమ్ములను వెనక్కు తీసుకువచ్చే అవకాశం ఉందా..? దీనిపై సిఎం కలుగచేసుకుని..దర్యాప్తు జరిపిస్తే..దీనిలో అసలు నిందితులు బయటకు వస్తారు..? మరి సిఎం ఏం చేస్తారో చూద్దాం...!

(194)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ