విశాఖ క‌లెక్ట‌ర్ గా భాన్క‌ర్ వ‌ద్దంటోన్న మంత్రి గంటా...? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విశాఖ క‌లెక్ట‌ర్ గా భాన్క‌ర్ వ‌ద్దంటోన్న మంత్రి గంటా...?

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటంనేని భాస్కర్‌ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనను అక్కడకు రాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు అడ్డుపడుతున్నారని బయటకు పొక్కింది. మంత్రి గంటా ముఖ్యమంత్రిని స్వయంగా కలసి ఒత్తిడి తెస్తున్నారా..? లేదా..వేరే మార్గాల ద్వారా ఒత్తిడి తెస్తున్నారా..? అనే విషయం బయటపడకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని..అనేక పనులు చక్కపెట్టుకున్న మంత్రి గంటాకు భాస్కర్‌ను కలెక్టర్‌గా నియమిస్తే..పరిస్థితి చేయిదాటిపోతుందనే భయాందోళనలు ఉన్నాయి. అదుగో..ఇదుగో..అంటూ సంవత్సరం నుండి కలెక్టర్‌ను బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా..ముఖ్యమంత్రిని భాస్కర్‌ కలసి స్వయంగా కోరినా..ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మంత్రి గంటా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నారా..? లేక ఇతర వ్యక్తుల ద్వారా సిఎంపై ఒత్తిడి తెస్తున్నారా..? అనే విషయం బయటకు రావడం లేదు. ఇటీవల జిఎడి అధికారులు కూడా కలెక్టర్‌ భాస్కర్‌ను విశాఖకు బదిలీ చేయబోతున్నారని, ఆ జిల్లా కలెక్టర్‌ను పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేస్తున్నారని కొంత మంది ఐఎఎస్‌ అధికారులతో చెప్పారు. 

  ఇదే విషయాన్ని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు...కూడా నిర్ధారించారు. ఏది ఏమైనా..గంటా అధికార బలమేమిటో..ఏ ఒక్కరికీ అర్థం కావడంలేదు. తాను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా వెళ్లబోతున్నానని 'ప్రవీణ్‌కుమార్‌' కింది స్థాయి అధికారులకు ఇంతకు ముందే చెప్పారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ భాస్కర్‌ను పలువురు అడిగినప్పుడు..మూడేళ్లు బాధ్యతలు నిర్వహించాను..ఎక్కువ సమయం ఇక్కడ ఉండడం సరికాదు..తనను బదిలీ చేయమని సిఎంను కలసి కోరానని, ఆయనేం నిర్ణయం తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాని...చెప్పారు. కానీ..ఆయనను విశాఖకు రానీయకుండా మంత్రి గంటా అడ్డుపడుతున్నారనే విషయం 'భాస్కర్‌'కు తెలుసో లేదో కానీ..జిల్లాకు చెందిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసు. 'భాస్కర్‌'ను ఎప్పుడు బదిలీ చేస్తారా..? అని ఆశగా ఎదురు చూస్తున్నారు జిల్లాకు చెందిన మంత్రులు, మెజార్టీ ఎమ్మెల్యేలు. ఈ మాసాంతానికి కలెక్టర్‌ భాస్కర్‌ బదిలీ ఖాయమని వారంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి కొద్ది రోజుల్లో బయటపడనుంది.

(163)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ