'కలెక్టర్‌ ముత్యాలరాజు' బదిలీ కోరుకుంటున్నారా..? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కలెక్టర్‌ ముత్యాలరాజు' బదిలీ కోరుకుంటున్నారా..?

వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలకు నొచ్చుకున్న కలెక్టర్‌ ముత్యాలరాజు కొద్ది రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సిఎంఒ అధికారులను, ఇతర ముఖ్యులను కలసి తనను బదిలీ చేయమని కోరారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జరిగింది. కొద్ది నెలల కిందటే...ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డిల వ్యవహారశైలితో విసుగు చెందిన ముత్యాలరాజు బదిలీ కోరుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కోరికను అంగీకరించలేదు. మూడు రోజుల కిందట ముఖ్యులను కలసిన ముత్యాలరాజు వైకాపా ఎమ్మెల్యే చేసిన విమర్శలు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సిఎంఒ అధికారులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చి వివరణ కూడా ఇచ్చారు. ముత్యాలరాజు నిజాయితీపరుడని అనడంలో సందేహం లేదు. చాలా మంచి అధికారి..కానీ..ఎందుకు ఆయనపై విమర్శలు, ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో తమకు తెలియడం లేదనిసిఎంఒ అధికారి ఒకరు చెబుతున్నారు. ముత్యాలరాజును బదిలీ చేయవద్దని, ఒకవేళ అటువంటి ప్రతిపాదన వస్తే..తాము సిఎంను కలసి ఆయనను బదిలీ చేయవద్దని కోరతామని మంత్రి సోమిరెడ్డి చెబుతున్నట్లుగా బయటకు పొక్కింది. 

  వైకాపా ఎమ్మెల్యే విమర్శలకు, ఆరోపణలకు జడిసి కలెక్టర్‌ ముత్యాలరాజు బదిలీ కోరుతున్నారా..? లేక మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలతో వేగలేక బదిలీ కోరుకుంటున్నారా..? సోమిరెడ్డి మంత్రి కానంతవరకు నెల్లూరు జిల్లాలో పరిస్థితి బాగానే ఉంది. ఆయన మంత్రి అయిన తరువాతే...కలెక్టర్‌ ఇతర అధికారులు ఆరోపణలు..విమర్శలను ఎదుర్కొంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదే విషయంపై మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు వివరణ అడగగా..ఆయన స్పందిస్తూ...కలెక్టర్‌ ముత్యాలరాజు నిజాయితీపరుడు వైకాపా ఎమ్మెల్యే కాకాని చేసిన విమర్శల్లో వాస్తవం లేదు. జిల్లా కలెక్టర్‌పై ఆ విధమైన విమర్శలు 'కాకాని' చేయకూడదు..రాజకీయ విభేదాలు ఉంటే..వారు వారు చూసుకోవాలి తప్ప..అధికారులపై దాడి చేయడం తగదు. ఒకవేళ కలెక్టర్‌ బదిలీ కోరకుంటే...ఆయన బదిలీ చేయవద్దు..అని ముఖ్యమంత్రికి చెబుతానని పేర్కొన్నారు. ఇంత మంది దృష్టిలో నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్న ముత్యాలరాజును 'కాకాని' ఎందుకు టార్గెట్‌ చేసుకున్నారని 'ఆదాల'ను ప్రశ్నించగా...ఏదైనా..'కాకాని' చేసిన విమర్శలు, ఆరోపణలు తప్పు. నిజాయితీపరుడైన అధికారిపై ఇటువంటి ఆరోపణలు చేస్తే..ఆయన మానసికంగా కుంగిపోతారు..జిల్లా పరిపాలన గాడితప్పుతుంది. అదే కాకుండా ఆయన అవినీతిపరులపై గట్టిగా వ్యవహరించలేరని పేర్కొన్నారు. వాస్తవ విషయాలను తాను సిఎం దృష్టికి తీసుకెళతానని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ ముత్యాలరాజే ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన బదిలీ కోరుకున్నా..ఆయనను తప్పించే అవకాశాలు లేవు.

(172)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ