WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నారాయణస్వామినాయుడు' ముద్దు...'బుచ్చయ్యచౌదరి' వద్దు...!

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు రాజకీయంగా విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని బాహాటంగా చెప్పిన మాజీమంత్రి బుచ్చయ్యచౌదరి ఇటీవల కాలంలో రాజమండ్రి పట్టణ నియోజకవర్గం నుంచిపోటీ చేస్తానని చెబుతున్నారు. టిడిపిలో భీష్మాచార్యునిగా పేరున్న 'నారాయణస్వామినాయుడు' స్వచ్చంధంగా పోటీ నుంచి తప్పుకుని ఆయన వారసులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. కానీ..ఆ నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పేరు, ప్రతిష్టలు..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేయని నేతగా పేరున్న ఆయనకే మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించవచ్చు. అంతే కాకుండా 'నారాయణస్వామినాయుడు' కుమారునికి పేరు ప్రతిష్టలు అంతంత మాత్రమే. తండ్రికి ప్రజల్లో ఉన్న అభిమానం నిజాయితీ,విధేయత, కుమారునికి లేవనే విమర్శ ఉంది. తాను మళ్లీ పోటీ చేయలేనని, 2014లోనే చంద్రబాబు ఒత్తిడితో పోటీ చేశానని 'చంద్రబాబు' మళ్లీఒత్తిడి చేస్తే పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఓడిపోయిన 'నారాయణస్వామినాయుడు'కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాల్సిన చంద్రబాబు కేంద్రమంత్రి అశోక్‌గజపతి ఒత్తిడితో పదవి ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ..'నారాయణస్వామినాయుడు' ఏనాడూ మంత్రి పదవి కోరలేదు..ఇస్తే మంచింది..ఇవ్వక పోయినా మంచిదే..పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మిగతా వారి వలే విమర్శలు, ఆరోపణలు చేయను..గతంలో కొంత మేర అవకాశాలు ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు..మంత్రి పదవి ఇస్తారనుకున్నాను..ఆ పదవి ఇవ్వడం చంద్రబాబు ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది..తానేనాడూ మంత్రి పదవిని కోరలేదని, ఇస్తానంటే వద్దనలేదు..రాజకీయంగా ప్రజల ఆశీస్సులతో గెలిచాను..ఆర్థికపరంగా ఓడిపోయాను..తన సన్నిహితులతో ఆయన చెబుతున్నారట. కానీ...బుచ్చయ్యచౌదరి విషయంలో 'చంద్రబాబు' కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీపార్వతి అధికారం చెలాయిస్తున్న సమయంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు...'బుచ్చయ్య' 'చంద్రబాబు'పై చేసిన విమర్శలు, ఆరోపణలు ఏ నాయకుడూ చేయలేదు. కానీ...'బుచ్చయ్య'ను టిడిపిలోకి తీసుకుని ఎమ్మెల్యేగా గెలిపించారు 'చంద్రబాబు'. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పార్టీలో నిజాయితీకీ విలువ లేదని, సిఫార్సులకు చంద్రబాబు విలువ ఇస్తున్నారని నర్మగర్భంగా విమర్శలు చేశారు. ఇదే ఆఖరి పోటీ...ఒకసారి మంత్రి పదవి ఇస్తే..బుచ్చయ్యచౌదరి తృప్తిపడతారు..ఆయనకు ఆ పదవి ఇవ్వండి..అని రాజమండ్రి ఎంపి మురళీమోహన్‌ చంద్రబాబును కలసి అభ్యర్థించినట్లు తెలిసింది. 

   గోదావరి జిల్లాలో 'కమ్మ' సామాజికవర్గానికి మంత్రి పదవి ఎలా ఇస్తాను.. ? దళితులు, కాపులు, బిసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ విషయం  మీకు తెలిసి కూడా..బుచ్చయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఎలా అడుగుతారు..? ఆయన కూడా మంత్రి పదవి ఎందుకు ఆశిస్తున్నారు...? ఆయన నిజాయితీనీ, సినియార్టీని గుర్తించే కదా..ఇన్నిసార్లు పోటీ చేసే అవకాశం కల్పించాను. ఇప్పటి వరకు చేసిన సేవ చాలు..కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలి కదా...అని చంద్రబాబు గట్టిగానే అన్నట్లు మురళీమోహన్‌ చెబుతూ వాపోయారు. మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు చాలా మంచివాడు..ఇవ్వకపోతే..నిజాయితీకి, సమర్థతకు, సీనియార్టీకి గుర్తింపు లేదు..అని విసుర్లు విసురుతారు..బాహాటంగా బయటపడతారు..బుచ్చయ్యచౌదరి..ఇటువంటి వారిని వదలించుకుంటే మంచిది...అని చంద్రబాబు నిర్ణయించుకుంటే..మళ్లీ బుచ్చయ్యకు పోటీ చేసే అవకాశం దక్కదు. కానీ..నారా యణస్వామి నాయుడు విషయంలో..ఆయన మాటకు విలువిస్తారు..ఆయననే పోటీ చేయమని ఒత్తిడి తెస్తారు..ఒకవేళ ఆయన పోటీ చేయనంటే..అభ్యర్థి ఎంపికలో ఆయన మాటకే చంద్రబాబు విలువ ఇస్తారు. ఇన్నేళ్ల చరిత్రలో 'చంద్రబాబు'పై విమర్శలు, ఆరోపణలు చేయకుండా ఉన్న ఆయనంటే 'చంద్రబాబు'కు అభిమానంతో..ఆ విధంగా చేస్తారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం 'అశోక్‌'కు ఇష్టం ఉండదు..'అశోక్‌'ను బాధ పెట్టడం..తనకు ఇష్టం ఉండదు..అని 'చంద్రబాబు' అప్పుడెప్పుడో వ్యాఖ్యానించినట్లు బయటపడింది. చివరకు..నారాయణస్వామినాయుడును నిలిబెడతారో..లేదో చూడాలి..బుచ్చయ్యకు టిక్కెట్‌ ఇస్తారో లేదో..తెలియడానికి..మరో ఆరు నెలలు వేచి చూడాల్సిందే...!

(233)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ