WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాహుల్‌గాంధీ' జోకరయ్యాడా...!?

జాతికి నాయకత్వం వహించాలనే ఆరాటం ఉన్న నాయకుడు ఆయన. కానీ...ప్రవర్తనలో పిల్లచేష్టలను మానుకోలేక పోతున్నారనడానికి..ఈరోజు పార్లమెంట్‌లో జరిగిన సన్నివేశమే ఉదాహరణ. అప్పటి దాకా..అనర్ఘళంగా, ఆవేశంగా, గంభీరంగా ప్రసంగించి...'మోడీ'ని..చెమటలు పట్టించిన యువనేత..'రాహుల్‌గాంధీ' తరువాత చేసిన చేష్టలు..జాతికి నాయకత్వం వహించాల్సిన వారు చేయాల్సిన పనులు కాదు. ఆవేశంగా ప్రసంగించి...అదే ఊపులో 'ప్రధాని మోడీ'ని వాటేసుకోవడంతో..అప్పటి దాకా.. చేసిందంతా...బూడిదలో పోసిన పన్నీరైందనడంలో ఎటువంటి సందేహం లేదు. తనను పప్పు అన్నా ఫర్వాలేదని, తనపై 'మోడీ'కి కోపం,ద్వేషం ఉన్నాయని, ఆయనలో అవి తొలగిస్తానని...హఠాత్తుగా..'మోడీ' వైపు వెళ్లి..ఆయనను కావలించుకుని..కాంగ్రెస్‌ ఎంపీలకు, బిజెపి ఎంపీలకు, యావత్తూ సభకు 'రాహుల్‌' షాక్‌ ఇచ్చారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడై ఉండి...కాబోయే ప్రధానిగా చెప్పుకుంటూ...ఇటువంటి పనులు చేస్తారా..? అంటూ సభలోని వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి..? ఎంత గంభీరంగా ఉండాలి..? 'రాహుల్‌' మనసులో ఏముందో..కానీ..ఆయన చేసిన చర్యతో..సభ మొత్తం ఆయనను జోకర్‌ను చూసినట్లు చూసింది. కానీ..ఇదేమీ పట్టించుకునే మూడ్‌లో ఆ నేత ఉన్నట్లు కనిపించలేదు. దానేదో..గొప్ప పనిచేసినట్లు..నవ్వుకుంటూ...వెళుతున్న సీన్‌ చూస్తే..'రాహుల్‌' ఎప్పటికీ మారడు...మరో ఐదేళ్లో...పదేళ్లో..మళ్లీ 'మోడీ' చేతిలో 'దేశం' బలికావల్సిందే అన్న..ఫీలింగ్‌ అటు ఎంపీలకు, ఇటు దేశ ప్రజలకు వచ్చింది. హేమిటో..కాంగ్రెస్‌ యువరాజు వారి లీలలు..? హతవిధీ..!

(483)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ