WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్నిక‌లొస్తున్నాయి...జీఎస్టీ త‌గ్గుతోంది....!

బిజెపి నాయకులకు ఎన్నికల ఫీవర్‌ పట్టుకుంది. ఎన్నికల్లో గెలుపొందడానికి ఏమి చేయాలో..అన్నీ చేసే..'మోడీ' బ్యాచ్‌ ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్న తరుణంలో..ఒక్కసారీగా..వివిధ వస్తువులపై విధించే జీఎస్టీని తగ్గిస్తూ..నిర్ణయం తీసుకుంది. మొన్నటి దాకా..ఇవేం జీఎస్టీ బాబోయే..మేం కట్టలేమన్నా..ముక్కుపిండి వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 100 వస్తువులపై జీఎస్టీని తగ్గించింది..లేదా..అసలు లేకుండా చేసింది. ఎందుకు బిజెపి పెద్దల్లో ఇంత మార్పు వచ్చిందంటే..రానున్న నెలల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడమే కారణమని తెలుస్తోంది.

ఇదే విషయంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ..హఠాత్తుగా బిజెపి పెద్దలకు జ్ఞానోదయం అయినట్లుంది..అయితే..వారికి చాలా ఆలస్యంగా..జ్ఞానోదయం..అయింది. 2017 జూలైలో మేము జీఎస్టీ మూడు స్లాబ్‌లు వద్దు..ఒకటే స్లాబ్‌ ఉండాలంటే..ప్రభుత్వంపట్టించుకోలేదు. నెలవారీ రిటర్న్స్‌ అవసరం లేదని మూడు నెలలకొకసారి..చేస్తే చాలని చెప్పినా..వినలేదు...ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో..జీఎస్టీని తగ్గిస్తూ వస్తూంది. ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూ ఉంటేనే బిజెపి ప్రభుత్వం..ప్రజలపై పన్నులు భారం వేయకుండా ఉంటుంది. గతంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా వివిధ వస్తువులపై పన్నులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం...రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మిజోరం రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..తాజాగా..వంద వస్తువులపై జీఎస్టీని తగ్గించిదని, ప్రభుత్వానికి ముందే జ్ఞానోదయం అయితే బాగుండేదని..'చిదంబరం' పలు ట్వీట్లులో పేర్కొన్నారు. మొత్తం మీద..ఎన్నికల పుణ్యాన 'గబ్బర్‌సింగ్‌' ట్యాక్స్‌ తగ్గడంపై...ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

(178)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ