లేటెస్ట్

సమాచారశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ 'ఫ్రాన్సిస్‌'కు పదోన్నతి...!

కాకినాడలో సమాచారశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న ఎం.ఫ్రాన్సిస్‌కు పదోన్నతి లభించింది. ఆయనను రాష్ట్ర సమాచారశాఖ ప్రధాన కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నాళ్లు నుంచో ఆయన ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టులో ఆయనను నియమించారు. ఫ్రాన్సిస్‌ ఈ నెల 30వ తేదీన రిటైర్‌ కానున్నారు. పదోన్నతి వచ్చిన మూడు రోజులకే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తోన్న పదన్నోతి ఎట్టకేలకు రావడం ఆయనను ఆనందానికి గురిచేసింది. సమాచారశాఖ కమీషనర్‌ ప్రత్యేక చొర తీసుకుని డిపిసి నిర్వహించడంతో ఆయన పదోన్నతికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం సమాచారశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ తేళ్ల కస్తూరిబాయి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. కాగా  రాజమండ్రి ఎస్‌ఐసిలో అస్టిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న జి.మనోరంజన్‌ కాకినాడ డిడిగా అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు. మరోవైపు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేస్తోన్న మరి కొందరు తమకు కూడా పదోన్నతి లభిస్తుందని, త్వరలో డీపీసీ నిర్వహిస్తారని ఆశిస్తున్నారు. 

(323)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ