లేటెస్ట్

'ఇంగ్లీషు'ను వ్యతిరేకిస్తే...తరిమికొడతాం:ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల స్థాయిలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేయడాన్ని ప్రముఖ సామాజికశాస్త్రవేత్త,ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య సమర్థించారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకించే శక్తులను తరిమికొడతామని ఆయన హెచ్చరించారు. విజయవాడలో ఈ రోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించే 'చంద్రబాబు, పవన్‌'లకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు రాదని, దళిత,బడుగు,బలహీనవర్గాల పిల్లలు ఆంగ్ల మాద్యంలో చదువుకోకూడదా..? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన నిర్ణయం వల్ల బడుగు,బలహీన,దళిత వర్గాలకు చెందిన పిల్లలు లాభపడతారని, రాజకీయ ప్రయోజనాలను ఆశించే 'చంద్రబాబు, పవన్‌లు వ్యతిరేకిస్తున్నారని 'ఐలయ్య'విమర్శించారు. 'జగన్‌' నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్‌ మారిపోతుందని, ఇంగ్లీషు చదవడం పెద్ద కష్టం కాదని, కార్పొరేట్‌శక్తులు ఇంగ్లీషు మీడియాన్నివ్యతిరేకిస్తున్నారని, ఇది సరికాదని, ఇలా వ్యతిరేకిస్తే మహిళలు చీపుర్లతో కొడతారని ఆయన ధ్వజమెత్తారు. 

బడుగు,బలహీనవర్గాలపిల్లలు బాగుపడడం 'బాబు'కు ఇష్టం లేదా..?

ఆంగ్ల మాద్యం వల్ల బడుగు,బలహీన,దళిత వర్గాల పిల్లలు బాగుపడతారని,వాళ్లు అలా బాగుపడడం 'చంద్రబాబు'కు ఇష్టం లేన్నట్లుందని, వైకాపా సీనియర్‌ నేత 'జూపూడి ప్రభాకర్‌రావు' విమర్శించారు. పేద పిల్లల భవిష్యత్‌ బాగుండాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, కుహనామేధావులు దీన్ని విమర్శిస్తున్నారని ఇది సరికాదని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఆయన తెలిపారు.

(281)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ