'జగన్‌'కు తెలంగాణ 'రెడ్డి' సామాజికవర్గం మద్దతు..? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'కు తెలంగాణ 'రెడ్డి' సామాజికవర్గం మద్దతు..?

'అమ్మా...ఆంధ్రప్రదేశ్‌'ను విడగొట్టి...'రెడ్డల'కు అన్యాయం చేశావు...? రెండు చోట్లా..'రెడ్డిలు' రాజకీయాధికారం లేకుండా పోయింది..ఇదంతా మీ వల్లే..అంటూ...టిడిపి..ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా..ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వద్ద నిట్టూర్చారు. రాష్ట్ర విభజన వల్ల..తమ కులానికి దక్కాల్సిన ముఖ్యమంత్రి పీఠం ఎవరికో దక్కిందన్న భావన ఆ సామాజికవర్గ నేతలతో పాటు..సామాన్య వ్యక్తుల్లోనూ..బలంగా నెలకొని ఉంది. రాష్ట్ర విభజన జరగకపోతే...లేదా...తమ సామాజికవర్గ నేతలు ఐక్యంగా ఉంటే...తమ కులానికి చెందిన వారికే ముఖ్యమంత్రి పదవి దక్కేదని.. వారి ప్రగాడ నమ్మకం. 

  రాష్ట్ర విభజనతో...తెలంగాణలో..రెడ్డి సామాజికవర్గం బలం..తగ్గకపోయినా..బలమైన శక్తులుగా మాత్రం గుర్తించ బడడంలేదనే భావన వారిలో ఉంది. అదే సమయంలో 'ఆంధ్రా'లో బలహీనమైపోయామన్న బాధ కూడా వారిలో కలిగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో..ఎట్టి పరిస్థితులోనైనా తెలంగాణ, ఆంధ్రాల్లో తమ కులానికి చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉండాలనే విధంగా..ఆ కులానికి చెందిన పెద్దలు తెర వెనుక తీవ్రంగా కృషి చేస్తున్నారట. ముఖ్యంగా..ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారానికి అడుగు దూరంలో ఉన్నామని, 'జగన్‌'కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తే...అధికారం స్వంతం అవుతుందని..వారిలో ఎక్కువ మంది ఆరాటపడుతున్నారట.

 ఈ నేపథ్యంలో 'జగన్‌'కు కావాల్సిన ఆర్థిక సహాయం అందించడానికి కొంత మంది 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున్న నిధులను సమీకరిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో 'జగన్‌' కనుక గెలవకపోతే..ఇక ఎప్పటికీ...ఆంధ్రాలో 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రులు కాలేరని, ఇదే ఆఖరి అవకాశమని,దీన్ని ఎట్టి పరిస్థితుల్లో..వదులుకోకూడదనే భావనతో..వారంతా కృషి చేస్తున్నారట. అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు...ఇతరత్రా సహాయం కూడా చేస్తున్నారట. ఆంధ్రాలో 'చంద్రబాబు' ఓడిపోతున్నారని ప్రచారం చేయడంలో...హైదరాబాద్‌కు చెందిన ఈ సామాజికవర్గ ప్రముఖులు ముందుభాగంలో ఉన్నారట. అదే విధంగా..విదేశాల్లోనూ..వీరు ఈ ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా..'చంద్రబాబు'ది అవినీతి ప్రభుత్వమని, ఆయన కొనసాగడానికి వీల్లేదని..కొంత మంది రిటైర్డ్‌ ఐఎఎస్‌అధికారులతో..వీరు తీవ్ర స్థాయిలో ప్రచారం చేయిస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో భూములు లాక్కుంటున్నారని వారికి అండగా ఉండాలని..హైదరాబాద్‌ నుంచి కొంత మందిని మేధావుల పేరుతో..దింపుతున్నారు. వారితో ప్రచారం చేయించడమే కాకుండా... కొంతమంది 'కమ్మ' పారిశ్రామికవేత్తలతో కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారట. వై.ఎస్‌.జగన్‌ అధికారంలోకి వస్తే...'కమ్మ' పారిశ్రామికవేత్తలు..గతంలో వై.ఎస్‌ హయాంలో సంపాదించుకున్నట్లు సంపాదించుకోవచ్చని..ఆశలు చూపెడుతున్నారట. మొత్తం మీద..'జగన్‌' అధికారంలోకి రావడానికి...ఆర్థిక,రాజకీయ,నైతిక మద్దతు ఇవ్వాలని వీరందరూ భావిస్తూ..ఆమేరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. మరి వారి కోరిక నెరవేరుతుందో..లేదో చూడాలి.

(1289)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ