WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'పై 'బొత్స' అసంతృప్తి...!

'ఏటీ...ఈ రాజకీయాలు...అబ్బెబ్బ...ఇంత అధ్వాన్నమా...ఈయనగారి కంటే...చంటోళ్లు..బాగా రాజకీయాలు...చేసేస్తారు...! ఇదేటీ...ఇట్లా..? అంటూ..తనను కలసినవారి వద్ద వైకాపా సీనియర్‌ నేత 'బొత్స సత్యనారాయణ' అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. నిన్న కాక మొన్న...'పవన్‌'పై తీవ్ర వ్యాఖ్యలు చేసేశారు..ఏమిటి..మళ్లీ..ఇప్పుడు..కాపు రిజర్వేషన్లపై..ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే..ఏటి చేస్తాం...మనమేటి..చేస్తాం...అంతా ఆయనిష్టం.. ఇటువంటి పార్టీలో ఉంటే...కష్టమే...? అంటూ ఆయన సీనియర్‌ వైకాపా నాయకుల వద్ద బావురమన్నాడట. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది మనమే...'చంద్రబాబు' మోసం చేస్తున్నాడన్నది..మనమే...! ఆయనేమో...రిజర్వేషన్లు చేసేసి...కేంద్రానికి పంపించిన తరువాత..మనకేటి..బాధ...మనమూ..కేంద్రంపై ఒత్తిడి తెద్దామంటే పోయేది...దానికి..ఇంతోటి ప్రకటనా..? ఇప్పుడేటి చేయాలా..? ఇప్పటికే పరువుపోతాంది...!

  పార్టీలో ఎవరినడిగి..ఈ ప్రకటన చేశారు..? దీనిపై పునరాలోచించాలి. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర పూర్తియ్యేలోగా...'జగన్‌' కాపు రిజర్వేషన్లపై..మళ్లీ ప్రకటన చేయాలని..'బొత్స'పట్టుపటుతున్నారట. కేంద్రం మెడలు వంచి...రిజర్వేషన్లు సాధిస్తామని.. చెప్పాలని...ఆయన 'జగన్‌'ను కోరుతున్నారట. పార్టీలో మరి కొందరు నేతలు కూడా...'బొత్స' చెప్పింది నిజమేనని..ఆయన చెప్పినట్లు చేయాలని అంటున్నారట. అయితే...తాను చెప్పిందానికి కట్టుబడి ఉంటానని..దీనిపై మరో ప్రకటన చేసేది లేదని..'జగన్‌' తేల్చి చెబుతున్నారట. ఇలా అయితే...పార్టీ నష్టపోతుందని..తాము పార్టీలో కొనసాగే విషయాన్ని ఆలోచించాల్సి ఉంటుందని కొందరు నేతలు అంటుండగా...ఉంటే...ఉండండి..మిమ్మలను చూసి ప్రజలు ఓట్లు వేయరు..నన్ను చూసి వేస్తారు..ఆపై మీఇష్టం..అంటూ...'జగన్‌' తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారట. దీంతో..ఏమి చేయాలో పాలు పోక..మరోసారి..దీనిపై ఆలోచించా లని..'బొత్స'తో ఆ నాయకులు 'జగన్‌'కు చెప్పించే ఆలోచనలో ఉన్నారట. మరి 'బొత్స' చెబితే...'జగన్‌' వింటారా..? ఏమో..?

(1881)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ