WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెవిపి' వర్సెస్‌ 'కిరణ్‌'...!

ఆంధ్రాలో అసలే ఆ పార్టీ అంతంత మాత్రం. రాష్ట్ర విభజనతో మట్టి కొట్టుకుపోయిన..ఆ పార్టీకి మళ్లీ జవసత్వాలు అందించా లని...ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గారధీ కొట్టుమిట్టాడుతుంటే...పార్టీలోని గ్రూపు తగాదాలు..పార్టీకి మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పార్టీని పటిష్టం చేయడానికి వారు కొట్టుకుంటుంటే...సిద్ధాంతలను అమలు చేయడంలో..తేడాలు వచ్చి కొట్టుకుంటున్నార్లే అని సరిపెట్టుకోవచ్చు. కానీ..వారు కొట్టుకునేది..ప్రత్యర్థులను ఎలా బలవంతులని చేయాలనే దానిపై. కాంగ్రెస్‌లో సుధీర్ఘకాలం ఉంటున్న రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, ఇటీవలే మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి 'కె.కిరణ్‌కుమార్‌రెడ్డి'ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. వారిద్దరూ..పార్టీని బలోపేతం చేసే విషయంలో కాకుండా..ఒకరు 'జగన్‌'కు..మరొకరు 'టిడిపి'కి మద్దతు ఇవ్వడానికి కొట్లాడుకుంటున్నారట.

ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉండి..దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ఆత్మగా వ్యవహరించిన 'కెవిపి రామచంద్రరావు' తన స్నేహితుడు కుమారుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని బలోపేతం చేసేందుకు..అన్ని రకాలైన సహాయాలు చేస్తున్నారట. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి 'కిరణ్‌కుమార్‌రెడ్డి' అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. 'జగన్‌' బలహీనమైతేనే...'కాంగ్రెస్‌' పుంజుకుంటుందని 'కిరణ్‌' వాదిస్తున్నారట. ఆయనను బలహీనం చేసేందుకు వచ్చే ఎటువంటి అవకాశాన్నైనా వదులు కోవద్దనేది..'కిరణ్‌' వాదన కాగా, స్నేహితుడి కుమారుని బలహీనపరిస్తే...'చంద్రబాబు' పుంజుకుంటారని...ఆయన కంటే 'జగన్‌'కే మద్దతు ఇవ్వడం రైట్‌ అని 'కెవిపి' వాదిస్తున్నారట. తన స్నేహితుడి కుమారుని ముఖ్యమంత్రి చేయడానికి కెవిపి..అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. కొందరు..తటస్థ నేతలను...వైకాపాలో చేర్చడంలో..ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌లో ఉండి..క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నవారిని కూడా..వైకాపాలో చేర్పిస్తున్నారట. దీన్ని 'కిరణ్‌' అభ్యంతరపెడుతున్నారట...ఈ విధంగా చేయడం వల్ల..'జగన్‌' ఎప్పటికీ కాంగ్రెస్‌కు లంగరని..ఇప్పటికైనా కెవిపి తన వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచిస్తున్నారట.అయితే..తనకు స్నేహితుడి కుమారుడే ముఖ్యమని..ఆయన శ్రేయస్సు కోసం కృషి చేస్తానని కెవిపి చెబుతున్నారట. కాంగ్రెస్‌లో ఉండి..ఇటువంటి పనులు చేసే బదులు వైకాపాలో చేరి..చేసుకోవచ్చు కదా..అని 'కిరణ్‌' గొణుగుతున్నారట. చివరకు ఈ విషయం 'రాహుల్‌గాంధీ' చెవికి చేరితే..కానీ..'కెవిపి' సంగతి తేల్చరని..'కిరణ్‌' వర్గం అంటోందట.

(271)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ