లేటెస్ట్

'మద్యం'పై మంత్రివర్గంలో ఆసక్తికరమైన చర్చ...!

ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యనియంత్రణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల వాగ్ధానంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తామని, ఈలోగా...రాష్ట్రంలో ఉన్న బెల్ట్‌షాపులన్నీ తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీని ఆయన నూటికి నూరుపాళ్లు అమలు చేశారు. అదే విధంగా బార్ల సంఖ్య తగ్గిస్తామన్న హామీని కూడా నెరవేర్చే పనిలో ఉన్నారు. ఒకవైపు మద్యంపై వచ్చే ఆదాయం పోతున్నా..మద్య నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు 'జగన్‌' ఈహామీని ఇచ్చినప్పుడు చాలా మంది మద్యం విషయంలో ఆయన ఆషామాషీగా వ్యవహరిస్తారని భావించారు. చివరకు స్వంత పార్టీ నేతలు కూడా ఆయన దీనిపై ఇంత తీవ్రంగా దృష్టిపెడతారని అనుకోలేదు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ..మద్య నియంత్రణపై తాను నాడు ఏమి చెప్పాడో..దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. పలువురు మంత్రులు మద్యనియంత్రణ వల్ల ఆదాయం పోతుందని హెచ్చరిస్తున్నా..ముఖ్యమంత్రి మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తూతూ మంత్రంగా కాకుండా...చిత్తశుద్దితో ఈ విషయంలో ఆయన చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మద్యం రేట్లు అమాంతం పెరిగిపోయి..మద్య ప్రియులు ఆందోళన చెందుతున్నా, వారి నుంచి వ్యతిరేకత వస్తున్నా..ముఖ్యమంత్రి చలించడం లేదు. ఇదే విషయంపై నిన్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర టూరిజం మంత్రి 'అవంతి శ్రీనివాస్‌'కు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మద్య ఆసక్తికరమై చర్చ జరిగినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 'శ్రీరామచంద్రుడ'ని ఆయన వలే మిగతా వారంతా ఉండరని 'అవంతి' పేర్కొనడంపై తాజాగా ముఖ్యమంత్రి స్వవిషయంపై ఆసక్తికరమైన చర్య జరుగుతోంది. యువకుడైన సిఎం జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగత విషయాలు చాలా మందికి తెలియదు. ఆయన ఇతర నాయకులకు ఉంటే వ్యసనాలు లేవంటారు. శాఖారం తీసుకోవడం, మితంగా భుజించడం ఆయన అలవాట్లన్నీ, మాంసాహారాన్ని కూడా పెద్దగా తీసుకోరని ఆయనకు సన్నిహితులమని చెప్పుకునే వారు చెబుతుంటారు. ఎక్సైర్‌సైజలు చేయడం, మితంగా భుజింజడం, ఇతర దుర్వసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటారట. దీని గురించే మంత్రి 'అవంతి' చెబుతూ ఆయన శ్రీరామచంద్రడు, సత్యహరిశంద్రుడు అని అన్నారని, ఇది అతిశయోక్తి కాదని ముఖ్యమంత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు చెబుతుంటారు.

(320)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ