WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అప్పుడే..అనురాధ'పై చర్యలు తీసుకొని ఉంటే...!

రాష్ట్ర దేవాదాయశాఖలో అవినీతిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గత కొన్నాళ్లుగా చెబుతూనే ఉంది. ఇక్కడ విషయాలన్నీ ఏకపక్షంగా జరుగుతున్నాయని, ఒకేసామాజికవర్గానికి చెందిన వారే పెత్తనం చెలాయిస్తున్నారని..వీరిపై చర్యలు తీసుకోవాలని... 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' పలు కథనాల్లో పేర్కొంది. ఈ రోజు పదవీ విరమణ చేయబోతున్న కమీషనర్‌ అనురాధపై వ్యవహారశైలిపై, అవినీతిపై పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఇదే విషయాన్ని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' మే12వ తేదీన ప్రచురించింది. దేవాదాయశాఖ ఉద్యోగుల ప్రమోషన్లలో భారీగా లంచాలు చేతులు మారుతున్నట్లు పేర్కొన్నాం. అప్పట్లో...కమీషనర్‌ కుటుంబ సభ్యులు ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని...కమీషనర్‌పై చర్యలు తీసుకోవాలని పలుసార్లు ప్రచురించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. కాకినాడ డిప్యూటీ కమీషనర్‌గా సూపరింటెండింగ్‌ స్థాయి అధికారిని నియమిం చినప్పుడే...అవీనీతి జరిగిందని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' పేర్కొంది.

 అప్పట్లో..ఆమె అవినీతి వ్యవహారాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో..ఆమె చెలరేగిపోయింది. తన సర్వీసు చివరి రోజు..పూర్తిస్థాయిలో దండుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. నేడు పదవీ విరమణ చేయబోతున్న ఆమె..ఒక్కసారిగా పదోన్నతులు,లేని ఉద్యోగాలు సృష్టించి సొమ్ము చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క రోజే...వందలాది మందికి ప్రమోషన్లు ఇస్తూ...ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. అదే సమయంలో కొత్త నియామకాలకు తెరదీశారు. మొత్తం ఒక్కో పదోన్నతికి, నూతన ఉద్యోగానికి రెండు నుంచి మూడు లక్షలు దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆమె కుటుంబ సభ్యులే ముఖ్యపాత్ర పోషించారని తెలుస్తోంది. దేవాదాయశాఖలో ఎప్పటి నుంచో..ఈ తతంగం నడుస్తోందని...వారిపై చర్యలు తీసుకోవాలని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఎన్నిసార్లు ప్రచురించినా ప్రభుత్వ పెద్దలు కానీ, సిఎంఒ అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. 

  గతంలో తమకు న్యాయంగా ప్రమోషన్లు రావాలని ఉద్యోగులు కోరినా..అప్పట్లో ససేమిరా అన్న 'కమీషనర్‌' ఆఖరి రోజు ఎందుకు హడావుడిగా ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదంతా సొమ్ములు కోసం కాదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆమె సామాజికవర్గమే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడిందనే మాట సిఎంఒ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఆమె చేస్తోన్న అవినీతి వ్యవహారాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు మాజీ ఐఎఎస్‌ అధికారులకు సహకరిస్తున్న తీరు అంతా తెలుసునని అయితే..ఆమె సామాజికవర్గాన్ని చూసి భయపడే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని..కొందరు దేవాదాయశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తం మీద...మొగ్గలోనే ఆమె అవినీతిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఇంత చెడ్డపేరు వచ్చేది కాదుకదా..అంటూ కొందరు ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు.

(393)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ