'జగన్‌' ఏం చెప్పాడో..ఎవరికైనా అర్థం అయిందా..!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' ఏం చెప్పాడో..ఎవరికైనా అర్థం అయిందా..!?

కాపు రిజర్వేషన్లపై తొందరపడి మాట్లాడి...ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి..ఆ సామాజిక వర్గం నుంచి వ్యక్తం అవుతోన్న అసంతృప్తిని తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. దీనిలో భాగంగా నిన్న పీఠాపురం సభలో తాను మాటకు కట్టుబడి ఉంటానని, తమ వంశం మాట ఇచ్చి..తప్పదని..ఇంకా ఏవేవో..చెప్పుకున్నారు. అంటే...మొన్న చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లేనా..? ఆయన మొన్న చెప్పిన దాని ప్రకారం కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదనే కదా..? అంతే...మాటకు కట్టుబడి ఉండడం అంటే..అదే అర్థం అవుతుంది.  దీనిలో ఎల్లో మీడియా కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, కాపు పెద్దలు కానీ...వక్రీకరించింది ఏమిటి..? నిన్న అంత సేపు మాట్లాడి కూడా...కాపులకు ప్రత్యేక రిజర్వేషన్‌ కోసం తాను కేంద్రంతో పోరాడతానని..ఒక్క మాట కూడా చెప్పలేదంటే...ఆయన గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లే..? మరే అదే మాట సూటిగా చెప్పకుండా...తాను బీసీలకు అన్యాయం చేయను...అంటున్నారు. ఇక్కడ బీసీలకు అన్యాయమనే మాట ఎక్కడ ఉంది...? వాళ్లకు ఉన్న రిజర్వేషన్‌ వారికి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా..వారి కోటాను కదిలించకుండానే...కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కావాలని...కేంద్రాన్ని కోరుతోంది. అసెంబ్లీలో చట్టం చేసింది కూడా అదే కదా..? దీనిలో బీసీలకు అన్యాయమనే మాట ఎక్కడ ఉంది. మొన్న 'జగన్‌' కాపు రిజర్వేషన్ల గురించి చెప్పిన మాటపై పార్టీలో ఒత్తిడి రావడంతో..ఆయన నిన్న దానిపై వివరణ లాంటి వివరణ ఇచ్చారు. అది కూడా..తాను మాటకు కట్టుబడి ఉంటానని, అన్యాయం చేయనని..మాటకు కట్టుబడడం..అంటే.. కాపుల రిజర్వేషన్‌ తన పరిధిలో లేదు..తనతో అయ్యేది కాదనే..దీన్నే సూటిగా చెప్పకుండా..తమ వంశం మాటకు కట్టుబడి ఉంటుందని, ఇంకా ఏదేదో..సోది అంతా చెప్పి...తప్పించుకోవాలని చూడడమేనా...మాటకు కట్టుబడి ఉండడం అంటే.  

(246)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ