WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రవిబాబు' ఆశలపై నీళ్లు చల్లిందెవరు..!?

పాపం..అందరు అధికారులకు ఇచ్చినట్లే..తనకూ...సర్వీసు పొడిగిస్తారని...రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'రవిబాబు' ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత...తమకు కావాల్సిన అధికారులకు 'సర్వీస్‌ ఎక్సెటెన్షన్‌' ఇస్తోంది. ముఖ్యంగా..అధికారపార్టీ నాయకులకు అంతరంగికులుగా పేర్కొన్న వారికి..వారు అడిగినా..అడగకపోయినా... ప్రభుత్వమే...సర్వీసు పొడిగించి..వారి సేవలను వాడుకుంటోంది. ఒకవేళ అలా సర్వీసు పొడిగించిక పోయినా...వారిని ఏదో ఒక దానికి సలహాదారునిగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవన్నీ చూసే...తనపై ఎన్ని ఆరోపణలు ఉన్నా... తనకూ..సర్వీసు పొడిగింపు వస్తుందని..పౌరసరఫరాలశాఖ మాజీ డైరెక్టర్‌ 'రవిబాబు' ఆశించారు. తానూ తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుడినేనని..ప్రచారం చేసుకున్నారు. ఒకరిద్దరు ప్రజాప్రతినిధులతో..ప్రభుత్వంపై ఒత్తిడి తెప్పించారు. అంతా తాను అనుకున్నట్లే జరిగింది. కానీ..చివరకు వచ్చే సరికి..ఆయన ఆశలు ఆవిరయ్యాయి. ఆయన సర్వీసుపొడిగింపును ప్రభుత్వం తిరస్కరించడంతో...ఆయన 31వ తేదీన రిటైర్‌ కావాల్సి వచ్చింది.

  కొంత మందికి..పొడిగింపు ఇచ్చి తనకు పొడిగింపు ఇవ్వకపోవడంపై..'రవిబాబు' ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాను కూడా అధికారపార్టీ నాయకులు..పనులన్నీ చేశానని...వారు చెప్పిన విధంగా పనిచేసినా..తనకెందుకు సర్వీసు పొడిగించ లేదో..అర్థం కావడం లేదని..అంటున్నారట. తాను టిడిపి ప్రభుత్వానికి గట్టి మద్దతు దారుడినని..వచ్చే ఎన్నికల్లో టిడిపి టిక్కెట్‌ ఇస్తే..ఎక్కడో..చోట పోటీ చేస్తానని ఇప్పటికే హింట్‌ ఇచ్చానని..అయినా..తనను ప్రభుత్వం పట్టించుకోలేదని..అంటున్నారట. తాను గతంలో ఏవో పొరపాట్లు చేస్తే..వాటిని పట్టుకుని..ఇప్పుడు సాధించడం సరికాదని...ఇప్పుడున్న అధికారుల్లో అవినీతిపరులు, వైకాపా సానుభూతిపరులు లేరా..? వారి సర్వీసు పొడిగించలేదా..? వారికి పొడిగించి.., తనను మాత్రం పక్కన పెట్టారని..ఆయన చెబుతున్నారట. అయితే..ఆయన సర్వీసు పొడిగించకపోవడం వెనుక సర్వీసు ఒక్కటే కారణం కాదని, ఆయనకు సర్వీసు పొడిగింపు ఇచ్చినా..ఆయన రాబోయే ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని..ఇదే విషయంపై ఆ పార్టీ నాయకులతో ఆయన చర్చించారని..ఇటువంటి వారికి..సర్వీసుపొడిగింపు ఇవ్వాల్సిన అవసరం లేదని..కొందరు సీనియర్‌ అధికారులు..సిఎంకు చెప్పారట. దీంతో..ఆయన సర్వీసు పొడిగింపు..అధికారులు పక్కన పెట్టారని...తెలుస్తోంది. ఏది ఏమైనా..కొందరికి మాత్రం వారు అడిగిన వెంటనే సర్వీసుపొడిగించి..తనకు పొడిగించక పోవడంపై..ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

(291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ