WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాంగ్రెస్‌కు పది శాతం ఓట్లు వస్తే...వైకాపా జెండా పీకేయాల్సిందే...!

రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించారనే కోపంతో...గత ఎన్నికల సమయంలో ప్రజలు కాంగ్రెస్‌ను నామ రూపాలు లేకుండా చేశారు. ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేసి తమ కసిని చాటుకున్నారు..ఆంధ్రా ఓటర్లు. ఇదంతా నాలుగేళ్ల నాటి సంగతి. ఇప్పుడు..పరిస్థితులు మారిపోయాయి. అధికారంలోకి వచ్చిన బిజెపి కన్నా...ఇప్పుడు..కాంగ్రెస్‌నే నయమనే వారి సంఖ్య రోజు రోజుకు రాష్ట్రంలో పెరిగిపోతోంది. నాడు కొందరి తప్పుడు సలహాల వల్ల...కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని, దాన్ని ఇప్పుడు వెనుక్కు తేలేకపోయినా..ఆంధ్రాకు న్యాయం చేయడంలో ముందుటామని...ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తోన్న ప్రకటనలు రాష్ట్ర ప్రజల్లో కొంత వరకు ఆ పార్టీపై ఆవేశం తగ్గడానికి ఉపయోగపడుతోంది. అదే సమయంలో..పార్టీలోని సీనియర్లంతా క్రియాశీలకం కావడం, వచ్చే ఎన్నికల్లో..అధికారంలోకి రాకపోయినా..ఓటు బ్యాంక్‌ను పెంచుకుంటే...2024లో సత్తా చాట వచ్చే భావనతో..పార్టీకి జవసత్వాలు కల్గించడానికి ఉమ్మడిగా పోరాటబాట ఎంచుకున్నారు. దీంతో...ఇప్పుడు...రాష్ట్రంలో గతంలో కన్నా...ఎక్కువ శాతం ఓట్లు ఆ పార్టీ సాధించగలుగుతుందనే భావన ఇటు ప్రజలతో పాటు..అటు పార్టీ నేతల్లోనూ వ్యక్తం అవుతోంది.

  గత ఎన్నికల్లో 2.80శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈ సారి కనీసం ఐదు నుంచి పదిశాతం ఓట్లు సాధిస్తుందనే భావన ఆ పార్టీ వర్గాల ద్వారా వ్యక్తం అవుతోంది. ఐదుశాతం ఓట్లు సాధిస్తే..ఆ ప్రభావం ప్రతిపక్ష వైకాపాపై ఉంటుందనేది మెజార్టీ వర్గాల నమ్మకం. అనాదిగా..కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌గా ఉన్న..వర్గాలన్నీ గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు ఆ వర్గాలు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరితే..ఓట్ల చీలిక వల్ల..వైకాపాకు నష్టం కలుగుతుందనేదని రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం. ఐదుశాతం ఓట్లు సాధిస్తేనే..వైకాపా విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అయితే తమ ఓటు బ్యాంక్‌ను పెంచుకునేందుకు..కాంగ్రెస్‌ పార్టీ తమ అధినేత 'రాహుల్‌గాంధీ'తో...ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేయించబోతున్నాయి. ఆయన కనుక ఇక్కడ సభలు ఏర్పాటు చేసి..రాష్ట్ర విభజన సమయంలో తప్పు జరిగిందని, దాన్ని సరిదిద్దుతామని..ఆంధ్రాకు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని, దానితో పాటు విభజన సమయంలో చేసిన హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇస్తే...ప్రజల్లో కాంగ్రెస్‌పై ఇంకా సానుకూలత ఏర్పడుతుందని దీంతో ఓటింగ్‌ శాతం మరింత పెరుగుతుందని..ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింత అంటే కనీసం పదిశాతం ఓటింగ్‌ సాధిస్తామని, ఇది తమ దాయాది..వైకాపాకు నష్టం చేకూరుతుందని..ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమ వల్ల వైకాపా ఓడిపోతే..వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదని, అప్పుడు తామే టిడిపికి ప్రత్యామ్నాయం అవుతామని..వారి అంచనా...ఇదే జరిగితే..వైకాపా ఎన్నికల తరువాత జెండా పీకేయాల్సిందే. మరి ఏమవుతుందో చూద్దాం.!

(2191)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ