WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రోజా' కాంగ్రెస్‌లో చేరుతుందా...!?

వైకాపా ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా రాజకీయభవిత్యంపై రకరకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆమె నగరి నుంచి వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత..ఆమె పలు విషయాల్లో వివాదాస్పదం అయ్యారు. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకునే నేతగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో 'జబర్ధస్త్‌' జడ్జిగా కూడా ఆమె రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. మరో వైపు ఫైర్‌బ్రాండ్‌గా..రాజకీయాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా..టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు 'లోకేష్‌'పై ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ...రాజకీయాల్లో...సంచలనం సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో 'జగన్‌' తరువాత..ఆ స్థాయి నేతగా ఆమె పేరు తెచ్చుకున్నా..అధినేత 'జగన్‌' మాత్రం ఆమెకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వనని చెబుతున్నారట. ఆమెను పార్టీ సేవల కోసం వాడుకుందామని..కొందరి నేతలతో అన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో...ఆమె కలవరపాటుకు గురవుతున్నారట. ఇప్పటికే 'నగరి' సీటును 'జగన్‌' ఓ ఎన్‌ఆర్‌ఐకి ఇస్తానని హామీ ఇచ్చారని...దీంతో 'రోజా' తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనన్న మాట ఆ వర్గాల నుంచి వస్తోంది. దీంతో...తన రాజకీయ భవిష్యత్‌ కోసం వేరే పార్టీని ఆశ్రయించాలని ఆమె చూస్తున్నారట. ఈ నేపథ్యంలో అధికార టిడిపి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోదు...! 'పవన్‌' పార్టీ సంగతి...చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో...ఏ పార్టీలో చేరినా...తనను పెద్దగా పట్టించుకోరని...కాంగ్రెస్‌ పార్టీ అయితే తనకు సూటు అవుతుందని ఆమె అంచనా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

  ఇప్పటికిప్పుడు ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుందని..ఎవరైనా అంటే నమ్మేవారి శాతం తక్కువే. రాష్ట్రంలో ఆ పార్టీ బలం నామ మాత్రమైన పరిస్థితుల్లో..నేడో..రేపో..అధికారంలోకి వస్తుందని..నమ్ముతున్న పార్టీ నుంచి ఆమె వెళతారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే...'జగన్‌' వ్యవహారశైలి చూసిన 'రోజా' వైకాపా అధికారంలోకి రాదని, ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్‌ లేదని...భావిస్తున్నారట. దీంతో..మాజీ ముఖ్యమంత్రి 'కిరణ్‌కుమార్‌రెడ్డి' సాయంతో..ఆమె కాంగ్రెస్‌లో చేరతారని..అంచనా వేస్తున్నారు. ఇప్పుడే ఆ విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయినా...రాబోయే ఐదారు నెలల్లో దీనిపై స్పష్టత వస్తుందని...వారు చెబుతున్నారు. మొత్తం మీద..'రోజా' కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే వార్తను కొందరు జోక్‌గా కొట్టేసినా...ఇది యధార్థమని కొందరు చిత్తూరు జిల్లా నాయకులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో..చెప్పలేం కనుక...ఏమైనా జరిగే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

(1108)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ