WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా'లో 'సైరా' సెట్‌ను కూల్చగలరా...!?

అనుకుంటాం...కానీ..అందరూ అన్నీ పనులు చేయలేరు. కొంత మంది మాత్రమే అటువంటి పనులు చేయగలరు...! అటువంటి ధైర్యవంతుల జాబితాలోకే వస్తారు..తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. ఆయన ఏమి చేయాలంటే..అది చేయగలరు...! ఎవడైనా..సరే కడిగేస్తారు..అప్పట్లో..చంద్రబాబును కానీ..ఈ మధ్య...మోడీ, అమిత్‌షాలను కానీ...తెలంగాణ ఉద్యమ సమయంలో...పవన్‌కళ్యాణ్‌ను కానీ...ఆయన ఉతికి ఆరేశారు. తరువాత వారితో సర్దుకున్నారులెండి...? అలా సర్దుకోవడంలో.. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయనుకోండి...? తాజాగా..ఇప్పుడు చూడండి..తెలుగు సినీ మెగాస్టార్‌ 'చిరంజీవి' ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' కోసం వేసిన 'సెట్టింగ్‌'లను నిమిషాల్లో కూల్చివేయించారు. అసలు ఎవరైనా ఊహించగలరా..? ఇటువంటి పనులు ప్రభుత్వం చేస్తుందని..కానీ...కెసిఆర్‌ చేయగలిగారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా...సెట్టింగ్‌లు వేశారని..ఆయనకు సమాచారం అందిన వెంటనే...వాటిని కూల్చివేసి..తానేమిటో..మరోసారి నిరూపించుకున్నారు. ఆ సినిమా..ఓ పెద్ద హీరోదని, ఆయన వెనుక..కులం, అభిమానులు, సొమ్ములు ఉన్నాయని ఇవేవీ ఆలోచించలేదు...! నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కనుక..వెంటనే కూల్చివేశారు. దీనిలో శభిషలకు తావు లేదు...! చేయాలనుకున్న పనిని చేసేశారు.

  ఇప్పుడు..ఈ విషయంపై ఆంధ్రాలో చర్చలు జరుగుతున్నాయి. అదే 'సైరా' సెట్టింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూల్చివేస్తే..ఎలా ఉండేదో..ఒక్కసారి ఊహించి చూడండి..అంటున్నారు...కొందరు టిడిపి నేతలు...! 'చిరంజీవి' సెట్టింగ్‌ను ఆంధ్రాలో కూల్చితే... వెంటనే కులసంఘాలు రోడ్ల మీదకు వచ్చేవి కావా..? తమ కులానికి చెందిన హీరో సెట్టింగ్‌లు కూలుస్తారా..? మేము మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం..అని వీరంగాలువేసే వారు కాదా..? ఆ మధ్య 'నంది' అవార్డుల సమయంలో..వేరే కులానికి ఇచ్చా రని..తమ కులానికి ఇవ్వలేదని..హైదరాబాద్‌లో కూర్చుని రోజుల తరబడి చర్చలు జరిపి..ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే కదా..? ఇప్పుడు కనుక...తెలంగాణలో 'సైరా' సెట్‌ను కూల్చిన విధంగా..ఇక్కడ కనుక జరిగితే...రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయ్యేదని..ఓ తెలుగుదేశం నాయకుడు అన్నారు. 'చిరంజీవి' సామాజికవర్గానికి చెందిన వారిని చంద్రబాబు ప్రభుత్వం బుజ్జగిస్తుందని, ఇటువంటి ఆలోచన కూడా చేయదని ఆ నాయకుడు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినా..సెట్‌ కూల్చిన అధికారులపైనే..'చంద్రబాబు' మండిపడేవారని...అటువంటి పనులు ఎందుకు చేశారని మందలిం చేవారని..ఆ నాయకుడు అన్నారు. కులాన్ని బూచిగా చూపి..ఆంధ్రాలో సాగించిన పెత్తనం...తెలంగాణలో మాత్రం సాగదని...కెసిఆర్‌ మరోసారి..నిరూపించారని..ఏది ఏమైనా కెసిఆర్‌ హీరో అని నాయకుడు...ప్రశంసల వర్షం కురిపించారు.

(544)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ