WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రవిబాబు' కోసం 'చక్రం' తిప్పుతున్న 'రాజశేఖర్‌'...!

ఆయనో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి. సర్వీసులో ఉన్నంత కాలం పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవినీతికి పాల్పడ్డారని...పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో..ఏ ప్రభుత్వం వచ్చినా..ఆయనను కీలకమైన పోస్టులో నియమించకుండా...ప్రాధాన్యత లేని పోస్టులో కూర్చోబెడుతూ వచ్చాయి. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ప్రాధాన్యత కలిగిన పోస్టే లభించింది. రాష్ట్రపౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌ పదవి లభించింది. చాలా రోజుల నుంచి అదే పదవి నిర్వహిస్తున్న ఆయన జూలై 31న పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసే ముందుకు..తన సర్వీసును పొడిగించాలని ఆయన ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన సర్వీసు ట్రాక్‌ రికార్డు బాగాలేదని..ఆయన సర్వీసు పొడిగించడం కుదరని..ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆయన రిటైర్‌ కావాల్సి వచ్చింది. అయితే..ఆశ్చర్యకరంగా..ఆయనను పుడ్‌ కార్పొరేషన్‌లో 'మెంబర్‌ సెక్రటరీ'గా నియమిస్తున్నారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఆయన నియామకానికి పౌరసరఫరాలశాఖ కమీషనర్‌ మరియు ఎక్స్‌అఫీషియో కార్యదర్శి రాజశేఖర్‌ మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రునుకుంటున్నారా..? ఆయ‌నే... జూలై31న రిటైర్ అయిన సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ జి.ర‌విబాబు.'రవిబాబు'ను మెంబర్‌ సెక్రటరీగా నియమించాలని కోరుతూ..ఆయన సిఎం చంద్రబాబు వద్ద సిఫార్సు చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు..పౌరసరఫరాలశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, స్టేట్ పుడ్ క‌మీష‌న్ ఛైర్మ‌న్ 'పుష్పరాజ్‌' కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారట. దీంతో..ఇప్పుడు ఆయనకు పోస్టు ఇచ్చేందుకు సిఎంఒ వర్గాలు ఫైల్‌ను రెడీ చేశారని తెలుస్తోంది.

ఆది నుంచి ఆయనపై ఆరోప‌ణ‌లే...!

పౌరసరఫరాలశాఖలో పనిచేసి రిటైర్‌ అయిన 'రవిబాబు'పై ఆది నుంచి విమర్శలే ఉన్నాయి. విజయవాడ మున్సిపల్‌ కమీషనర్‌గా పనిచేసినప్పుడు ఆయనపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉన్నప్పుడు భారీగా సంపాదించారని, దాంతో..ఆయనను ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారు. అంతకు ముందు రంగారెడ్డి ఆర్‌డిఒగా ఉన్నప్పుడు కూడా అవినీతికి పాల్పడ్డారనే మాట వినిపించింది. సీనియర్‌ ఐఎఎస్‌గా ఉన్న ఆయనకు సర్వీసులో ఉన్నప్పుడెప్పుడూ ఏ జిల్లాకు ఆయనను కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వలేదంటే..ఆయనపై ఉన్న ఆరోపణలు ఎంత బలంగా ఉన్నాయో..అర్థం అవుతోంది. ఇప్పుడు సర్వీసు నుంచి రిటైర్‌ అయిన తరువాత కూడా ఆయన సర్వీసు పొడిగింపుకు ముందు ప్రభుత్వం ఒప్పుకోలేదు. అయితే...మంత్రి పుల్లారావు, కమీషనర్‌ రాజశేఖర్‌, స్టేట్ పుడ్ క‌మీష‌న్ ఛైర్మ‌న్ పుష్పరాజ్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. ఆయనకు సర్వీసులో అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా న్యాయం చేయాలని..మంత్రి పుల్లారావు..సిఎంకు చెప్పారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో 'రాజశేఖర్‌' కూడా సిఫార్సు చేశారట. 'చంద్రబాబు' వద్ద ఉన్న సాన్నిహిత్యంతో...రాజశేఖర్‌ ఆ సిఫార్సు చేశారని..పౌరసరఫరాలశాఖ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఆయన చెబితే..సిఎం లేదు..అని అనరని..అందుకే.. 'రవిబాబు' ఆయనతో చెప్పించుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అద్దె కార్లపేరుతో దోపిడీ...!

కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో 'రవిబాబు' మూడు కార్లు వాడుకున్నారని, వాటికి ఒక్కో దానికి నెలకు రూ.60,000/- చొప్పున నెలకు దాదాపు రూ.1,80,000/-లు కార్పొరేషన్‌ నుంచి చెల్లించారని, ఇదంతా ఎవరి సొమ్ము. ఒక డైరెక్టర్‌కు మూడు కార్లు ఎందుకు..? మూడు కార్ల నెలకు లక్షా 80వేల రూపాయలు చెల్లించారంటే ఐదు సంవత్సరాల్లో కార్ల పేరుతో ఎంత దోపిడి జరిగిందో ప్రభుత్వానికి తెలియదా..? అదే విధంగా రైస్‌ మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున్న దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రైస్‌మిల్లర్ల వద్ద నుంచి రూ.50లక్షలు వసూలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. దీని విషయంలో పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఎంతో నిజాయితీపరుడ్ని అని అందరూ నమ్మాలని ఆయన ఇటీవలే..డైరెక్టర్‌గా పౌరసరఫరాలశాఖలో సోషల్‌ ఆడిట్‌ను నిర్వహించారు.ఈ ఆడిట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో తెలియదు కానీ...రాజధాని జిల్లాలో మాత్రం అధికారులను బదిలీ చేశారు. ఇదంతా 'మెంబర్‌ సెక్రటరీ' పదవి కోసం ఆయన చేసిన డ్రామా అని ఉద్యోగుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్న...ఈయనకు పౌరసరఫరాలశాఖ కమీషనర్‌, పుడ్‌కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మద్దతు ఇవ్వడానికి కేవలం..కులమే కారణమని ఆ వర్గాలు చెబుతున్నాయి. తమ కులం లేదా సబ్‌ కులానికి చెందిన వ్యక్తికి సహాయం చేయడ కోసమే...వీరంతా కూడబలుక్కుని...ఆయనకు మద్దతు ఇస్తున్నారట. మొత్తం మీద..ఇన్ని ఆరోపణలు ఉన్న అధికారికి..సర్వీసు ముగిసిన తరువాత కూడా మళ్లీ ప్రభుత్వ పదవిలో కొనసాగించే అవకాశం ప్రభుత్వం కల్పించాలని యోచించడం నిజంగా విచారకరం. ప్రభుత్వం ఇప్పటికైనా...సరైన దిశలో వెళ్లాలని స‌చివాల‌య వ‌ర్గాలు కోరుకుంటున్నాయి.

(603)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ