లేటెస్ట్

గుజరాతీయులపై 'మహారాష్ట్రీయుల' గెలుపు...!

ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ...గతంలో  మహారాష్ట్రలోనూ స్థానికత అంశంపై పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. ఉమ్మడి మహారాష్ట్రలో 'గుజరాత్‌' భాగంగా ఉన్నప్పుడు... మొన్న మొన్నటి దాకా తెలంగాణలో 'ఆంధ్రా' వాళ్ల పరిస్థితి ఎలా ఉండేదో..? అదే పరిస్థితి మహారాష్ట్రలో 'గుజరాత్‌' వాళ్ల పరిస్థితి అలానే ఉండేది. మహారాష్ట్రలో భారీ ఎత్తున్న గుజరాత్‌కు చెందిన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి భారీగా అర్జించేవారు. నాటి వారి అర్జనను చూసిన స్థానిక మహారాష్ట్రీయులు పెద్ద ఎత్తున స్థానిక నినాదాన్ని తెచ్చి..గుజరాత్‌ వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని డిమాండ్‌ చేసేవారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అదే పరిస్థితి అన్నట్లు. రాను రాను పరిస్థితి మరీ విషమించడంతో..ఉమ్మడి మహారాష్ట్రను విడదీసి 'గుజరాత్‌' రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో గుజరాత్‌ వ్యాపారులు మొత్తం తమ స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుని..రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. వారి రాష్ట్రం అభివృద్ధి చెందినా...మహారాష్ట్రలో వారు స్థాపించిన వ్యాపారాలతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఇటీవల కాలం వరకు దీని గురించి పెద్దగా చర్చ జరగకపోయినా..తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత మరోసారి స్థానిక నినాదం బాగా పనిచేసిందనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రంలో బిజెపి,శివసేన కలసి అధికారంలోకి వచ్చాయి. కానీ..'శివసేన' కోరిక కారణంగా అది సాధ్యం కాలేదు. కానీ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని బిజెపి పెద్దలు ఆడిన డ్రామాతో మళ్లీ బిజెపి 'శివసేన' మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ..మహారాష్ట్ర రాజకీయ పార్టీలు స్థానిక నినాదం ముందుకు తెచ్చి..గుజరాత్‌ పెత్తనం మనమీద వద్దంటూ ఐక్యతను చాటుకోవడంతో నాలుగు రోజుల బిజెపి ప్రభుత్వం పతనమైందనే విశ్లేషకుల మాట. దేశ వ్యాప్తంగా గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్తలు అన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఇక్కడా వారిదేనా పెత్తనమనే మాట బయటకు రావడంతో స్థానిక నినాదం ముందుకు వచ్చి బిజెపి పుట్టిముంచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

(294)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ