WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కమ్మ' కులస్తులు...'బాబు' ఓడిపోవాలని కోరుకుంటున్నారా...!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్వంత కులస్తుల నుంచి ఎదురు దెబ్బ తగులనుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోంది. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ...చేయూత ఇవ్వలేదనే మాట వారిలో ఉంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు...ఆయన కోసం ఏకతాటిపై వచ్చి పనిచేసిన 'కమ్మ' సామాజికవర్గం...ఇప్పుడు ఆయనపై సానుకూలత వ్యక్తం చేయడం లేదు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఈ వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి తమ సామాజికవర్గానికి చెందిన వాడైనా...ఆయన తమను పట్టించుకోవడం లేదని తమ పనులు ఏమీ జరగడం లేదని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

   2014లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి తాము ప్రధాన పాత్ర పోషించామని, తమ ఆస్తులను అమ్ముకుని పార్టీ కోసం పనిచేశామనే భావన ఆ సామాజికవర్గ నాయకుల్లో ఎక్కువగా ఉంది. అదే సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..తెగించి పనిచేసి..పార్టీని నిలబెట్టామని...అటువంటి తమకు ఈ నాలుగేళ్లల్లో 'చంద్రబాబు' చేసిందేమిటన్న బాధ వారిలో అంతర్లీనంగా ఉంది. కొంత మంది బడాపారిశ్రామికవేత్తలైన 'కమ్మ' నాయకులకు ఆయన పదవులు, ఇతర ఆర్థిక సహాయాలు చేసి మేళ్లు చేశారు. మరి కొంత మంది పత్రికాధిపతులు, ఇతర రంగాలకు చెందిన వారికి ఇతోధిక సహాయం చేసి ఉండవచ్చు. కానీ..అదంతా వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే. రాష్ట్ర జనాభాలో దాదాపు 7శాతం ఉన్న తమ కులంలో అతి పేదరికం అనుభవిస్తున్న వారు ఉన్నారని, వారిని 'చంద్రబాబు'పట్టించుకోవడం లేదనే భావన వారిలో ఉంది. పేరు మోసిన పారిశ్రామికవేత్తలు, సినీజనాలు, ప్రతికాధిపతులు, ఇతరులకు మేలు జరిగితే..అదంతా ఆ సామాజికవర్గానికి మేలు జరిగినట్లని..రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. 

 వాస్తవానికి...'కమ్మ' సామాజికవర్గానికి చంద్రబాబు హయాంలో నష్టమే జరుగుతోంది. ఆయన ఆ సామాజికవర్గాన్ని గుర్తించరు.. వారు ఎటూ...పోరు..కులం కోసం తనను మోస్తారని..ఆయన భావన కావచ్చు. అది కొంత వరకు నిజమే...! తింటానికి తిండి లేకపోయినా..మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చాలా మంది ఆ సామాజికవర్గ ప్రజలు కోరుకుంటారనడంలో సందేహం లేదు. కానీ..వారి బాధలను మాత్రం చంద్రబాబు కానీ..ఆయన కుమారుడు 'లోకేష్‌' కానీ పట్టించుకోరు. వారిద్దరికీ...ఈసామాజిక వర్గ విలువ తెలియదు...అందుకే వారిని దూరంగా పెడతారు. కానీ..రాష్ట్రంలో మిగతా కులాలు మాత్రం..'కమ్మ' సామాజికవర్గానికి 'చంద్రబాబు' దోచిపెడుతున్నారనే ప్రచారం చేస్తున్నారు..అది వాస్తవ విరుద్ధం. ప్రచారం ఏమి జరిగినా..కొంత మంది 'కమ్మ' కులస్తులు మాత్రం ఈసారి..ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 

  అదే సమయంలో రాజధాని ప్రాంత జిల్లాలైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని 'కమ్మ' సామాజికవర్గ నేతలు..ప్రతిపక్ష వైకాపాతో ఇప్పటికే చేతులు కలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది...నాయకులు..ఆ పార్టీ తరుపున పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. వీరితో పాటు కొంత మంది కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ మారడానికి అంతా సిద్ధమైంది. వై.ఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లబ్ది పొందిన కొంత మంది 'కమ్మ' సామాజిక పారిశ్రామికవేత్తలు..ఇప్పుడు..వారిని రెచ్చగొడుతున్నారు. 'జగన్‌' అధికారంలోకి వస్తే...'కమ్మ'లకు ప్రోత్సాహం లభిస్తుందని నూరిపోస్తున్నారు. వై.ఎస్‌ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఒక పారిశ్రామికవేత్త, సినీనటులు కొంత మంది..ఇప్పుడు..వీరిని మార్చడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దీంతో...తమకు మేలు చేయని...'చంద్రబాబు' కన్నా..మేలు చేస్తాడనే పేరున్న 'జగన్‌' వైపు వెళ్లడానికి..ఎక్కువ మంది ప్రయ త్నాలు చేస్తున్నారు. మరి 'చంద్రబాబు' దీనిపై దృష్టి పెడతారో..లేక పోతే పోతారు..మిగతా కులాల మద్దతు ఉంటే చాలనుకుంటే...మాత్రం 'సొంత సామాజికవర్గం' గట్టిగా దెబ్బతీస్తుందనే మాట..సర్వత్రా వ్యాపిస్తోంది.

(964)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ