WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

క‌లైంజర్ క‌న్నుమూత‌

రాజకీయ కురువృద్ధుడు, కలైంజర్‌ బిరుదాంకితుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎం.కరుణానిధి ఈరోజు కన్నుమూశారు. 94 సంవత్సరాల కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోసవ్యాధి, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో ఆయన కావేరి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు ఆయన ఆరోగ్యం మరింత క్షీణిం సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.

(143)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ