WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న భారత్‌...!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో భారత్‌ మరోసారి పరాజయం పాలయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టును ఇంగ్లాండ్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. లార్డ్సులో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో..భారత్‌ ఘోరపరాభావన్ని మూటగట్టుకుంది. మొదటి ఇన్సింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌ రెండో ఇన్సింగ్స్‌లోనూ అదే దారిలో నడిచింది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రాణించలేకపోవడంతో..భారత్‌ ఘోరపరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌ తన మొదటి ఇన్సింగ్స్‌ను 396/7 డిక్లేర్‌ చేయడంతో రెండో ఇన్సింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. సున్నా పరుగులకే 'విజయ్‌' వికెట్‌ను కోల్పోయిన భారత్‌ ఆ తరువాత ఎక్కడా పుంజుకోలేక పోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. రాహుల్‌, పుజారా, రహానె, కోహ్లీ రెండంకెల స్కోరు సాధించినా...క్రీజ్‌లో నిలవలేకపోయారు. మరో వైపు స్పిన్నర్‌ అశ్విన్‌ మాత్రం ఇంగ్లాండ్‌ పేస్‌కు ఎదురు నిలిచాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందరూ వెంట వెంటనే అవుట్‌ అయినా..'అశ్విన్‌' పోరాటాన్ని ఆపలేదు. చివరి బ్యాట్స్‌మెన్‌ అండగా కొన్ని పరుగులు రాబట్టినా..అది భారత్‌కు, ఇంగ్లాండ్‌కు ఉన్న అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో 'బ్రాండ్‌, అండర్స్‌న్‌'లు నాలుగు వికెట్లు సాధించగా వోక్స్‌ ఒక వికెట్‌ సాధించి..జట్టును విజయపథంలో నడిపించారు. మొత్తం మీద ఇంగ్లాండ్‌ ఇన్సింగ్స్‌ 159 పరుగుల తేడాతో..భారత్‌ను ఓడించి ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0కు తన ఆధిక్యాన్ని పెంచుకుంది.

(115)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ