లేటెస్ట్

ఆర్టీసీ కార్మికులారా రేపు విధుల్లో చేరండి:కెసిఆర్‌

సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులందరూ రేపు విధుల్లో చేరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. 52రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించినా..నిన్నా, మొన్న విధుల్లో చేరాలని భావించినా...ఆర్టీసీ అధికారులు వారిని విధుల్లో చేరకుండా అడ్డుకున్నారు. పలువురు ఆర్టీసీ కార్మికులను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారిపై దయతలచి వారందరినీ రిజాయినింగ్‌ కమ్మని చెప్పారు. చాలా రోజుల నుంచి ఉద్రిక్తత వాతావరణంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆర్టీసీ కార్మికులపై పన్నీటి జల్లు కురుస్తోంది. తక్షణం ఆర్టీసీని ఆదుకునేందుకు వందకోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులందరూ తన బిడ్డలని, వారిని ఆదుకునేందుకు తాము ముందుకు వస్తున్నామని అన్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తామని, ఆర్టీసీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్‌ నాయకుల మాటను విని నష్టపోయారని, ఎన్నో మంచిపనులు చేసిన తాము...ఆర్టీసీని బతికించుకోవడం కోసం ఎటువంటి చర్యలైనైనా తీసుకుంటామని తెలిపారు. 

(407)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ